PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vijayamma-sharmilaaf8e11ef-9582-4bee-bb44-cd232a953bae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vijayamma-sharmilaaf8e11ef-9582-4bee-bb44-cd232a953bae-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబంలో కూడా పలు చీలికలు కనిపిస్తున్నాయి.. ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కనిపిస్తారా లేదా అనే విషయం పై కూడా అందరికీ సందేహం గానే ఉంది.. ముఖ్యంగా ఈ పరిస్థితి విజయమ్మకు అత్యంత సంకటంగా మారింది. ఇలాంటి ఇబ్బందులు దేశ రాజకీయాలలో ఏ కుటుంబానికి కూడా వచ్చి ఉండవని పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు.. ఓకే కుటుంబంలోని వ్యక్తులు వేరువేరJAGAN;VIJAYAMMA;SHARMILA{#}Y. S. Rajasekhara Reddy;Doctor;Katthi;News;MP;kadapa;Sharmila;Reddy;CM;Jagan;YCPవిజయమ్మ: కొడుకా..? కూతురా..? పయనం ఎటువైపు..?విజయమ్మ: కొడుకా..? కూతురా..? పయనం ఎటువైపు..?JAGAN;VIJAYAMMA;SHARMILA{#}Y. S. Rajasekhara Reddy;Doctor;Katthi;News;MP;kadapa;Sharmila;Reddy;CM;Jagan;YCPSat, 06 Apr 2024 07:32:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబంలో కూడా పలు చీలికలు కనిపిస్తున్నాయి.. ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కనిపిస్తారా లేదా అనే విషయం పై కూడా అందరికీ సందేహం గానే ఉంది.. ముఖ్యంగా ఈ పరిస్థితి విజయమ్మకు అత్యంత సంకటంగా మారింది. ఇలాంటి ఇబ్బందులు దేశ రాజకీయాలలో ఏ కుటుంబానికి కూడా వచ్చి ఉండవని పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు.. ఓకే కుటుంబంలోని వ్యక్తులు వేరువేరు పార్టీలలో చేరి ఉండవచ్చు కానీ.. ఎదురు బదురు గా నిలిచి కత్తులతో దూసుకుపోతూ..ఎదుటి వారి వినాశనం కోరుకోవడం ఎక్కడ జరిగి ఉండదు.


అయితే తల్లిగా విజయమ్మ.. అటు షర్మిల,ఇటు జగన్ ఇద్దరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.. ముఖ్యంగా విజయమ్మ జగన్ రెండవసారి సీఎం కావాలని నూరు శాతం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.. కానీ ఈ సమయంలోనే వైయస్ షర్మిల కడప నుంచి పోటీ చేసి ఎంపీ కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. షర్మిల పోటీ చేస్తున్న జిల్లాలో కూడా వైయస్సార్ కుటుంబ సభ్యులను దశాబ్ద కాలం పాటు అక్కడి ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు తమ బిడ్డల ఇద్దరిలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వమని కోరడమంటే అది విజయమ్మకి కత్తి మీద సాము లాంటిది..


పులివెందులలో జగన్ కి పోటీగా.. కడప ఎంపీ సీట్ లో  షర్మిల పోటీ చేయబోతోంది.. షర్మిల గెలుపుతో జగన్ ఓటమి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఎందుకంటే కడప ఎంపీ సీటు గెలవాలి అంటే కచ్చితంగా పులివెందులలో మెజారిటీ రావాలి.. కానీ అన్నా చెల్లెలు ఇద్దరు రాజకీయం చేస్తూ ఉంటే తల్లిగా విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తి కల్పిస్తోంది. అందుకే ఈసారి విజయమ్మ ఎవరికి మద్దతు ఇవ్వరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇద్దరికీ మాత్రం తన దీవెనలు ఇస్తారని చెప్పుకొచ్చినట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ అభ్యర్థులను రిలీజ్ చేసే సమయంలో కూడా తన తల్లి పక్కన ఉన్నది. అలాగే జగన్ ను దీవించి ఎన్నికల ప్రచారానికి కూడా విజయమ్మ పంపించారు. 2019లో వైసీపీ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన విజయమ్మ ఈసారి దూరంగా ఉండబోతోంది. మొత్తానికైతే ఒక తల్లిగా ఆలోచించి బిడ్డల క్షేమం కోరుకుంటోంది విజయమ్మ..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>