Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli7bef06da-afc7-4a16-9be3-4c5b554db76d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli7bef06da-afc7-4a16-9be3-4c5b554db76d-415x250-IndiaHerald.jpg17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులందరికీ కూడా టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది. ఒక్కసారైనా జట్టు టైటిల్ గెలవక పోతుందా ప్రతి సీజన్లో కూడా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతిసారి నిరాశ పరుస్తూనే ఉంటుంది. అయితే మెన్స్ జట్టుతో సాధ్యం కానీ టైటిల్ కలా ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల జట్టుతో సాధ్యమైంది. దీంతో ఆర్సిబి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి టKohli{#}VIRAT KOHLI;GEUM;ravi shastri;bhavana;Indiaఅలా అయితే.. కోహ్లీ ఎన్నో ఐపిఎల్ ట్రోఫీలు గెలిచేవాడు : రవిశాస్త్రిఅలా అయితే.. కోహ్లీ ఎన్నో ఐపిఎల్ ట్రోఫీలు గెలిచేవాడు : రవిశాస్త్రిKohli{#}VIRAT KOHLI;GEUM;ravi shastri;bhavana;IndiaSat, 06 Apr 2024 14:30:00 GMT17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులందరికీ కూడా టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది. ఒక్కసారైనా జట్టు టైటిల్ గెలవక పోతుందా ప్రతి సీజన్లో కూడా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతిసారి నిరాశ పరుస్తూనే ఉంటుంది. అయితే మెన్స్ జట్టుతో సాధ్యం కానీ టైటిల్ కలా ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల జట్టుతో సాధ్యమైంది. దీంతో ఆర్సిబి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


 అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి టైటిల్ కొట్టినట్లుగానే అటు ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు గట్టిగానే నమ్మారు. కానీ ఊహించని రీతిలో మరోసారి ఆర్సిబి జట్టు నిరాశ పరుస్తూనే వస్తుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్లు పట్టికలో చివరి నుంచి ఈ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆర్సిబి ఆట తీరు చూస్తే ఈసారి కూడా టైటిల్ గెలవడం కష్టమే అనే భావన సొంత అభిమానుల లోనే కలుగుతుంది అని చెప్పాలి.


 ఇలాంటి పరిస్థితులను నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఐపీఎల్ అనేది వ్యక్తిగత ఆట అయివుంటే ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎక్కువ ట్రోఫీలు గెలిచేవాడు అంటూ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. కానీ అది గ్రూప్ గేమ్ కావడం వల్లే కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్లో కోహ్లీ ధారాళంగా పరుగులు చేస్తున్నప్పటికీ అతనికి.. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందడం లేదు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>