Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ipl3a6624b8-8762-48d4-ae2a-9fe27d016b1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ipl3a6624b8-8762-48d4-ae2a-9fe27d016b1d-415x250-IndiaHerald.jpgరాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.. ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ టీం కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశారు అంటే ఐపీఎల్లో ఆర్సిబి జట్టు తోపు టీం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అద్భుతమైన ప్రదర్శన చేసి ఇప్పటికే ఎక్కువసార్లు టైటిల్ గెలిచి ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అదేది జరగలేదు. ఇప్పటివరకు కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ.. చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది అన్న విషIpl{#}VIRAT KOHLI;Ambati RayuduRCB జట్టు.. ఎప్పటికీ టైటిల్ గెలవలేదు : రాయుడుRCB జట్టు.. ఎప్పటికీ టైటిల్ గెలవలేదు : రాయుడుIpl{#}VIRAT KOHLI;Ambati RayuduSat, 06 Apr 2024 14:00:00 GMTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.. ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ టీం కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశారు అంటే ఐపీఎల్లో ఆర్సిబి జట్టు తోపు టీం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అద్భుతమైన ప్రదర్శన చేసి ఇప్పటికే ఎక్కువసార్లు టైటిల్ గెలిచి ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అదేది జరగలేదు. ఇప్పటివరకు కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.


 ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ.. చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ కూడా బెంగళూరు టీం లోనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఆ జట్టుకు మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని డూప్లెసిస్ జట్టును సారథిగా ముందుకు నడిపిస్తున్న టైటిల్ కల మాత్రం ఆ జట్టుకు నెరవేరడం లేదు. ఆర్సిబి  అభిమానులు అందరూ కూడా తమ అభిమాన జట్టు ఒక్కసారైనా టైటిల్ గెలవలేక పోతుందా అని వేయికళ్లతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు.


 ఇలాంటి సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవలేదు అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకున్న స్టార్ ఆటగాళ్లు.. గ్రౌండ్ లో కంటే డగ్ అవుట్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఆర్సిబి తలరాత ఎప్పటికీ మారదు. అలాగే ఆ జట్టు బౌలర్లు ఎప్పుడు అత్యధిక పరుగులు సమర్పించుకుంటూ ఉన్నారు. ఆర్సిబి జట్టు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ లు  రాణించడం నేనైతే ఎప్పుడూ చూడలేదు అంటూ అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>