PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections85a309bf-8195-40e2-8480-65f7355fc00b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections85a309bf-8195-40e2-8480-65f7355fc00b-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అనేది నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పిన ప్రాంతం.ఆచార్య ఎన్జీ రంగ స్వాతంత్రోద్యమం తర్వాత రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి నాయకులకి శిక్షణ తరగతులు ఇచ్చింది అక్కడే.అలాంటి చోట ప్రస్తుతం ఎలక్షన్ ఫైట్ అనేది సీనియర్ కి మరియు జూనియర్ కి మధ్య రసవత్తరంగ ఉంది.పొన్నూరులో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ విజయం సాధించింది. రెండు సార్లు మాత్రమే వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది.టీడీపీ ఆవిర్భావంతో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన వీరయ్య చౌదరి రెండు సాassembly elections{#}choudary actor;Jr NTR;murali;Kamma;Tammudu;Thammudu;School;Narendra;Venkatroshaiah Kilari;Guntur;Ponnur;TDP;YCP;Assembly;Minister;District;Congress;Elections;Partyగుంటూరు : రసవత్తరంగా సీనియర్ vs జూనియర్ రాజకీయాలు..?గుంటూరు : రసవత్తరంగా సీనియర్ vs జూనియర్ రాజకీయాలు..?assembly elections{#}choudary actor;Jr NTR;murali;Kamma;Tammudu;Thammudu;School;Narendra;Venkatroshaiah Kilari;Guntur;Ponnur;TDP;YCP;Assembly;Minister;District;Congress;Elections;PartySat, 06 Apr 2024 05:47:34 GMTగుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అనేది నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పిన ప్రాంతం.ఆచార్య ఎన్జీ రంగ స్వాతంత్రోద్యమం తర్వాత రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి నాయకులకి శిక్షణ తరగతులు ఇచ్చింది అక్కడే.అలాంటి చోట ప్రస్తుతం ఎలక్షన్ ఫైట్ అనేది సీనియర్ కి మరియు జూనియర్ కి మధ్య రసవత్తరంగ ఉంది.పొన్నూరులో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ విజయం సాధించింది. రెండు సార్లు మాత్రమే వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది.టీడీపీ ఆవిర్భావంతో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన వీరయ్య చౌదరి రెండు సార్లు గెలిచి మూడవసారి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి పై ఓటమి పాలయ్యారు. వీరయ్య చౌదరి మరణానంతరం ఆయన కొడుకు నరేంద్ర కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో మాత్రమే కిలారి రోశయ్య చేతిలో ఓటమి చవిచూశారు.అప్పటి నుండి నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు.రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అభ్యర్థితో ఢీ కొట్టడం కోసం ఈసారి వైసీపీ ఒక కొత్త ప్రయోగం చేసింది.దాంతో గత ఎన్నికల్లో గెలిచినా కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పంపి పొన్నూరులో అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి అంబటి తమ్ముడు ఐనా అంబటి మురళిని బరిలోకి దించింది.అంబటి మురళి రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి.

రేపల్లెకి చెందిన అంబటి కుటుంబం గుంటూరులోనే స్థిరపడింది. కాపు సామజిక వర్గానికి చెందిన అంబటి మురళిని ఆ ఈక్వేషన్తో పొన్నూరు నుండి పోటీకి దించింది వైసీపీ అధిష్టానం.దాంతో కాపు మరియు కమ్మ సామజికవర్గ నేతల మధ్య పొన్నూరులో మరోసారి బిగ్ ఫైట్ నడుస్తుందనే చెప్పాలి.అక్కడ ముప్పైయి రెండు వేల మంది కాపు సామజికవర్గ ఓటర్లు ఉండగా ఇరవై నాలుగు వేల మంది కమ్మ సామజికవర్గ ఓటర్లు ఉన్నారు.అలాగే ఎస్సిలో మాల వర్గ ఓటర్లు ఇరవై ఎనిమిది వేల ఓటర్లు ఉండగా మాదిగ వర్గ ఓటర్లు పందొమ్మిది వేల మంది ఉన్నారు. ఇరవై నాలుగు వేల మంది ఉన్నా మైనారిటీలు పొన్నూరు ఎన్నికల్లో కీలకంగా నిలుస్తారు.వీటన్నింటిని ఆధారం చేసుకొని వైసీపీ అధిష్టానం కాపు సామజికవర్గానికి చెందిన వ్యక్తిని దించింది.అటు టీడీపీ కూడా జనసేనతో కూటమిలో ఉంది కాబట్టి ఈసారి కచ్చితంగా కాపు వర్గ ఓట్లు తమకే వస్తాయన్న ధైర్యంతో ఉన్నారు.గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ధూళిపాళ్ళ ఈసారి గెలిచి రివేంజ్ తీర్చికోవాలి అనుకుంటున్నారు.వైసీపీ అభ్యర్థి మాత్రం చాప కింద నీరులాగా దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది సీనియర్ vs జూనియర్ లలో ఎవరిదరికి చేరుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>