Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleecfd605b-e77c-47ba-ab5e-d0518be4b8aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleecfd605b-e77c-47ba-ab5e-d0518be4b8aa-415x250-IndiaHerald.jpgశ్రీలీల యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. ఆమె రెండేళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసింది. కానీ ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. వరుస పరాజయాలను ఫేస్‌ చేయడంలో ఈ బ్యూటీ కెరీర్‌ తలకిందులైంది.శ్రీలీలకి పెళ్లి సందడి సినిమా లైఫ్‌ ఇచ్చింది. కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి జోడీగా నటించింది శ్రీలీల. ఇందులో ఆమెచేసిన డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. బాడీలో ఈజ్‌ అందరిని ఆకర్షించింది. దీంతో వెంటనే మేకర్స్ ఈ అమ్మడిని హీరోయిన్లుగా తీసుకున్నారు.మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ధమాఖా చిత్రంsocialstars lifestyle{#}Ravi;k raghavendra rao;ravi teja;Red chilly powder;Venky Kudumula;Raccha;Devarakonda;BEAUTY;marriage;Kannada;Cinemaబ్లాక్ బస్టర్ మూవీను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ శ్రీలీల....!!బ్లాక్ బస్టర్ మూవీను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ శ్రీలీల....!!socialstars lifestyle{#}Ravi;k raghavendra rao;ravi teja;Red chilly powder;Venky Kudumula;Raccha;Devarakonda;BEAUTY;marriage;Kannada;CinemaSat, 06 Apr 2024 22:35:00 GMTశ్రీలీల యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. ఆమె రెండేళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసింది. కానీ ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. వరుస పరాజయాలను ఫేస్‌ చేయడంలో ఈ బ్యూటీ కెరీర్‌ తలకిందులైంది.శ్రీలీలకి పెళ్లి సందడి సినిమా లైఫ్‌ ఇచ్చింది. కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి జోడీగా నటించింది శ్రీలీల. ఇందులో ఆమెచేసిన డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. బాడీలో ఈజ్‌ అందరిని ఆకర్షించింది. దీంతో వెంటనే మేకర్స్ ఈ అమ్మడిని హీరోయిన్లుగా తీసుకున్నారు.మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ధమాఖా చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. ఈ చిత్రంలో మరోసారి డాన్సులతో రచ్చ చేసింది. సినిమా పెద్ద హిట్‌ కావడంతో శ్రీలీల క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమా విజయంలో ఆమె డాన్సులు కీలక పాత్ర పోషించాయని అన్నారు. అప్పటికే శ్రీలీలకి ఆఫర్లు క్యూ కట్టాయి. దీనింతో ఆ తాకిడి మరింత పెరిగింది.ఆ తర్వాత వరుసగా ఆరేడు సినిమాలకు సైన్‌ చేసింది శ్రీలీల. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌, భగవంత్‌ కేసరి, `గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. ఇందులో `భగవంత్‌ కేసరి`ఫర్వాలేదు. మిగిలిన మూవీస్‌ అన్నీ పరాజయం చెందాయి. దీంతోపాటు విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి తప్పుకుంది. ఓ కన్నడ చిత్రం నుంచి కూడా ఆమె తప్పుకుంది. ఇలా తప్పుకున్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కూడా ఉండటం ఆశ్చర్యంగా మారింది.

మూవీ ఏంటో కాదు, టిల్లు స్వ్కేర్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలని అనుకున్నారు. ఆమె ఆల్మోస్ట్ ఖరారు అయ్యింది. కానీ అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది. బోల్డ్ సీన్లు ఉండటం, లిప్‌ లాక్ సీన్లు ఉండటంతో సినిమా నుంచి ఆమె తప్పుకుందట. ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్‌ అనుకున్నారు. ఆమె కూడా తప్పుకుంది. మీనాక్షి చౌదరీ, మడోన్నా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లు నో చెప్పారు.ఆ తర్వాత మళ్లీ అనుపమా పరమేశ్వరన్‌ వచ్చింది. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కావడంతో తాను ఈ మూవీలోకి వచ్చినట్టు తెలిపింది అనుపమా. ఆమె ఖాతాలో పెద్ద హిట్‌ పడింది. అంతేకాదు నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. కొత్త డోర్లు ఓపెన్‌ చేసుకుంది. కొత్త సినిమా అవకాశాలకు మార్గం ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. ఇకపై అనుపమా రేంజ్‌ వేరే ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల వరకు వెళ్తుంది. కానీ ఇంతటి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ని మాత్రం శ్రీలీల మిస్‌ చేసుకుంది. ఈ సినిమా చేస్తే ఆమె లెక్క మారిపోయింది.మళ్లీ పుంజుకుని ఇండస్ట్రీని ఊపేసేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ బ్యాడ్‌ లక్ అని చెప్పొచ్చు.ప్రస్తుతం శ్రీలీల పవన్‌ కళ్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో నటిస్తుంది. ఇది రావడానికి మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు నితిన్‌తో కలిసి రాబిన్‌హుడ్‌ చిత్రంలో నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రమిది. షూటింగ్‌ దశలో ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>