PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jayaprakash-narayanaf949820c-83ce-4f98-b138-334caefb8a64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jayaprakash-narayanaf949820c-83ce-4f98-b138-334caefb8a64-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన , బీజేపీ కూటమికి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించిన సంగతి విదితమే. బాగా వెనక పడిన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు అయితేనే మేలని, దీనిలో భాగంగానే కూటమికి లోక్ సత్తా సపోర్టు చేస్తుందని ఆ మధ్య ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంJayaprakash Narayana{#}Doctor;Janasena;Bharatiya Janata Party;YCP;Jagan;Partyఏపీ: జగన్ కొన్ని సూపర్ గా అమలు చేసాడు: జయప్రకాష్ నారాయణఏపీ: జగన్ కొన్ని సూపర్ గా అమలు చేసాడు: జయప్రకాష్ నారాయణJayaprakash Narayana{#}Doctor;Janasena;Bharatiya Janata Party;YCP;Jagan;PartySat, 06 Apr 2024 12:50:00 GMTఆంధ్రాలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన , బీజేపీ కూటమికి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించిన సంగతి విదితమే. బాగా వెనక పడిన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు అయితేనే మేలని, దీనిలో భాగంగానే కూటమికి లోక్ సత్తా సపోర్టు చేస్తుందని ఆ మధ్య ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, జగన్ పాలన ఎలా ఉందో అనే అంశంపైన జయప్రకాష్ మార్కుల రూపంలో తన స్పందనను తెలియజేశారు.

ఈ క్రమంలోనే జగన్ పాలనలో కొన్ని విషయాలు అద్భుతంగా ఉన్నాయని జయప్రకాష్ నారాయణ పొగడడం ఇపుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ప్రజా సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ చాలా నిబద్దతతో పని చేస్తోందని ఆకాశానికెత్తేశారు. ఈ విషయంలో 5కి గాను 4 మార్కులు వేయవచ్చని అన్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తోందంటూ 3 మార్కులు, హెల్త్ కేర్ అంత గొప్పగా లేదంటూనే ఇటీవల తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానానికి 3 మార్కులు వేయవచ్చని జయప్రకాష్ నారాయణ ఈ సందర్బంగా అభిప్రాయ పడ్డారు. అయితే ఏపీలో విద్యా వ్యవస్థకు కేవలం 2 మార్కులే ఇచ్చారాయన. అదే విధంగా వైద్య వ్యవస్థకు 2 మార్కులు, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు.

వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇవ్వడంతో సదరు యాంకర్ ఆశ్చర్యకరంగా ప్రశ్నించడంతో అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేకుండా దానిని ప్రేవేశపెట్టి తప్పు చేశారని అభిప్రాయ పడ్డారు. ఇక మొత్తంగా గత ఐదేళ్లలో ఏపీలో జగన్ సర్కార్ పాలనకు కేవలం 1 నుండి 2 మార్కులు ఇవ్వడం కొసమెరుపు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు 2,హెల్త్ కేర్ కు 2, పెట్టుబడుల ఆకర్షణకు 1 మార్కు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి నిర్మూలన విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని కామెంట్ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>