Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/courtd188cbaf-2cff-46a9-9f91-33adbfdfbd64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/courtd188cbaf-2cff-46a9-9f91-33adbfdfbd64-415x250-IndiaHerald.jpgసాధారణంగా భార్యాభర్తల బంధం అనేది సినిమాల్లో, సీరియల్స్ లో చూపించినట్లుగానే ఉంటుందా అంటే.. ఎలా ఎందుకు ఉంటుంది బాసూ.. సినిమాలో చూపించినట్లు బాగుంటుంది అనుకునే మేము మోసపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత లైఫ్ ఇలా ఉంటుందని తెలిస్తే అసలు పెళ్లి జోలికి వెళ్లే వాళ్ళమే కాదు అని ఎంతో మంది భర్తలు తమ గోడును వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని జోక్స్ చూస్తూ ఉంటాం. ఏకంగా ప్రతి విషయంలో భర్తను భార్య తప్పు పడుతుందని.. తన డామినేషన్ ఉండేలా చూసుకుంటుందని ఇలాంటి మీమ్స్ వస్తూ ఉంటాయి. Court{#}Wife;marriage;Husband;court;Delhiభార్య చీటికి మాటికి పుట్టింటికి వెళ్లడం.. మానసిక క్రూరత్వమే : హైకోర్టుభార్య చీటికి మాటికి పుట్టింటికి వెళ్లడం.. మానసిక క్రూరత్వమే : హైకోర్టుCourt{#}Wife;marriage;Husband;court;DelhiSat, 06 Apr 2024 11:45:00 GMTసాధారణంగా భార్యాభర్తల బంధం అనేది సినిమాల్లో, సీరియల్స్ లో చూపించినట్లుగానే ఉంటుందా అంటే.. ఎలా ఎందుకు ఉంటుంది బాసూ.. సినిమాలో చూపించినట్లు బాగుంటుంది అనుకునే మేము మోసపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత లైఫ్ ఇలా ఉంటుందని తెలిస్తే అసలు పెళ్లి జోలికి వెళ్లే వాళ్ళమే కాదు అని ఎంతో మంది భర్తలు తమ గోడును వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని జోక్స్ చూస్తూ ఉంటాం. ఏకంగా ప్రతి విషయంలో భర్తను భార్య తప్పు పడుతుందని.. తన డామినేషన్ ఉండేలా చూసుకుంటుందని ఇలాంటి మీమ్స్ వస్తూ ఉంటాయి.


 అయితే ఇది నిజమేనా భర్తలను అడిగితే.. ముమ్మాటికి నిజమే.. అది అతని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అందుకే భర్తల అందరి లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని ఇలా మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు మగాళ్లు. అయితే ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత నిజంగానే పెళ్లి తర్వాత లైఫ్ భార్య చేతిలో కీలుబొమ్మ లాగా ఉంటుందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. అది సరేగాని ఇప్పుడు భార్యాభర్తల బంధం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా. సాధారణంగా ఏ చిన్న గొడవ జరిగిన భార్య చీటికిమాటికి అలుగుతూ పుట్టింటికి వెళ్లడం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇలా పుట్టింటికి వెళ్ళిన భార్యను బ్రతిమిలాడుకొని మరి మళ్ళీ భర్త ఇంటికి తెచ్చుకుంటాడు. అయితే ఇలా భర్త తప్పు లేకపోయినప్పటికీ భార్య అలిగి చీటికి మాటికి పుట్టింటికి వెళ్లడం మానసిక క్రూరత్వమే అంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. పరస్పర సహకారం, విధేయత ఉన్నప్పుడు మాత్రమే వివాహ బంధం కలకాలం నిలబడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల కాలంలో కాలంలో ఏడుసార్లు భార్య తనను విడిచిపెట్టిందని.. వెళ్ళిన ప్రతిసారి మూడు నుంచి పది నెలలు పుట్టింట్లోనే ఉండేదని.. అందుకే తన భార్య నుంచి విడాకులు కావాలంటు భర్త కోరగా.. అతని వాదన విన్న కోర్టు అతను విడాకులు తీసుకోవడం సభబే అంటూ తేల్చి చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>