PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202456859ba8-c969-42fb-b39f-9d1c44363731-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202456859ba8-c969-42fb-b39f-9d1c44363731-415x250-IndiaHerald.jpgవైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీలో చేరే వారికంటే జారుకున్న వారే ఎక్కువ అవుతున్నారు.తాజాగా మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది.ఇండియా హెరాల్డ్ కి తెలిసిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీకి హాయ్ చెప్పి ఆ పార్టీలో చేరిపోయారు. పూతలపట్టు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎస్సీ వర్గంలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న బాబుకు.. వైసీపీ టికెట్ నిరాకరించింది. గత 2019 వ సంవత్సరంలోఆయన వైసీపీ తరఫున పోAP Elections 2024{#}Putalapattu,Chittoor,Scheduled caste,Hanu Raghavapudi,SV Mohan Reddy,media,News,India,TDP,MLA,Party,Congress,Jagan,CBN,YCPవైసీపీ: చేరే వారి కన్నా జారుకుంటున్న వారే ఎక్కువ?వైసీపీ: చేరే వారి కన్నా జారుకుంటున్న వారే ఎక్కువ?AP Elections 2024{#}Putalapattu,Chittoor,Scheduled caste,Hanu Raghavapudi,SV Mohan Reddy,media,News,India,TDP,MLA,Party,Congress,Jagan,CBN,YCPSat, 06 Apr 2024 14:04:00 GMTఇండియా హెరాల్డ్ కి తెలిసిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీకి హాయ్ చెప్పి ఆ పార్టీలో చేరిపోయారు. పూతలపట్టు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎస్సీ వర్గంలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న బాబుకు.. వైసీపీ టికెట్ నిరాకరించింది. గత 2019 వ సంవత్సరంలోఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో ఏకంగా 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బాబు గెలిచారు. అయితే.. ఈ దఫా మాత్రం ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని.. పార్టీలో కూడా సఖ్యతలేదని.. పైగా టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని పేర్కొన్న వైసీపీ అధిష్టానం బాబుకు టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించింది. దీంతో అప్పట్లోనే బాబు ''ఎస్సీలంటే ఆత్మాభిమానం ఉండదా? మీ మోచేతి నీళ్లు తాగి బతకాలా?'' అంటూ.. వైసీపీపై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు.


ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ రెండు రోజులుకే నోరు సవరించుకున్నారు.తను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని..జగన్‌ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఇక, అప్పటి నుంచి వైసీపీకి, బాబుకు గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఇక, వైసీపీ పూతలపట్టు అభ్యర్థిగా 2014లో ఇదే పార్టీ నుంచి గెలిచిన ఎం. సునీల్‌కుమార్‌కు ఇచ్చారు. ఈ పరిణామాలతో బాధపడిన బాబు.. వైసీపీ పార్టీకి పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలా చేరేవారి కన్నా.. జారుకుంటున్న వారే ఎక్కువగా ఉండడం వైసీపీకి ఇబ్బంది అవుతుంది. గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు కీలక నాయకులు గుడ్ బై చెప్పారు. ఆ ముగ్గురూ కూడా  జగన్ పదే పదే తాను తనతోనే కలుపుకున్న వర్గాలని చెబుతున్న సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. వీళ్ళలో కిల్లి కృపారాణి(బీసీ-కళింగ), మహమ్మద్ ఇక్బాల్‌(మైనారిటీ ముస్లిం), ఎం.ఎస్ బాబు(ఎస్సీ-మాదిగ) ఉన్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>