EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy15814b2b-65dd-448d-8264-130711fa58da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy15814b2b-65dd-448d-8264-130711fa58da-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రంగంపై ఫోకస్‌ పెట్టారు. ఆహారశుద్ధి రంగం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాలని రేవంత్‌ రెడ్డి ఆలోచిస్తున్నారు. 14 రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. అందుకే యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో... అrevanth reddy{#}Banking;Professor;Revanth Reddy;Government;Hyderabad;Telangana;Reddy;Prime Minister;CMరేవంత్‌ రెడ్డి: ఆదాయం కోసం ఆ రంగంపై ఫోకస్‌ పెట్టారా?రేవంత్‌ రెడ్డి: ఆదాయం కోసం ఆ రంగంపై ఫోకస్‌ పెట్టారా?revanth reddy{#}Banking;Professor;Revanth Reddy;Government;Hyderabad;Telangana;Reddy;Prime Minister;CMSat, 06 Apr 2024 08:38:00 GMTతెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రంగంపై ఫోకస్‌ పెట్టారు. ఆహారశుద్ధి రంగం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా  తెలంగాణను  అభివృద్ధి చేయాలని రేవంత్‌ రెడ్డి ఆలోచిస్తున్నారు. 14 రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. అందుకే  యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నాయి.


ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో... అపెడా, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార శుద్ధి ప్రోత్సాహంపై  సదస్సు జరిగింది. యూనిట్ల స్థాపన, చేయూత, బ్యాంకింగ్ రుణ సదుపాయాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ నుంచి నాబార్డ్ సాయంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడి, చిరుధాన్యాలు, మునగ పొడి, ఇతర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి.  


వ్యవసాయ ఆహార ఉత్పత్తి యూనిట్ల విస్తరణకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో.. పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2014 నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ సుమారు 80 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించింది. బియ్యాన్ని విభిన్న ఉత్పత్తులుగా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, విస్తరించేందుకు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్‌తో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ భాగస్వామిగా ఉంది.


ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం - పీఎంఎఫ్‌ఎంఈ కింద అసంఘటిత ఆహార ఉత్పత్తి తయారీ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటైంది. ఈ పథకం కింద వ్యవసాయ అనుబంధంగా ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలు, సహకార సంఘాలకు, ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు, వ్యక్తితగతంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీపై 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది. అందుకే ఈ రంగంపై ఫోకస్‌ పెడితే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>