Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/local6f4bda74-97d1-4fc3-b4eb-c8e5a24cdc16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/local6f4bda74-97d1-4fc3-b4eb-c8e5a24cdc16-415x250-IndiaHerald.jpgఎన్నికలు వచ్చాయి అంటే చాలు ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఎన్నో రకాల వ్యూహాలతో ప్రచార రంగంలో దూసుకుపోతూ ఉంటారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా లోకల్ నాన్ లోకల్ అనే నినాదం ఎన్నికలు వచ్చినప్పుడల్లా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలకు చెందిన.. నేతలు పోటీ చేసిన ప్రతిసారి ఇక స్థానికులైన నేతలు అయ్యుండి బరిలో నిలిచిన అభ్యర్థులు... ఇక ఇదే నినాదంతో ప్రజల్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లోని ఎన్నో పార్లమెంట్ స్థానాలలోLocal{#}Mini;Ranga Reddy;Uppal;Malkajgiri;Huzurabad;Parliment;Service;Yevaru;Telangana;Congress;Elections;MLA;Reddy;MP;local language;Bharatiya Janata Partyలోకల్ vs నాన్ లోకల్.. మరి మినీ ఇండియాలో గెలిచేదెవరూ?లోకల్ vs నాన్ లోకల్.. మరి మినీ ఇండియాలో గెలిచేదెవరూ?Local{#}Mini;Ranga Reddy;Uppal;Malkajgiri;Huzurabad;Parliment;Service;Yevaru;Telangana;Congress;Elections;MLA;Reddy;MP;local language;Bharatiya Janata PartySat, 06 Apr 2024 14:30:00 GMTఎన్నికలు వచ్చాయి అంటే చాలు ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఎన్నో రకాల వ్యూహాలతో ప్రచార రంగంలో దూసుకుపోతూ ఉంటారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా లోకల్ నాన్ లోకల్ అనే నినాదం ఎన్నికలు వచ్చినప్పుడల్లా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలకు చెందిన.. నేతలు పోటీ చేసిన ప్రతిసారి ఇక స్థానికులైన నేతలు అయ్యుండి బరిలో నిలిచిన అభ్యర్థులు... ఇక ఇదే నినాదంతో ప్రజల్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లోని ఎన్నో పార్లమెంట్ స్థానాలలో ఇలాంటి నినాదంతోనే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇక తెలంగాణలో అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అయితే ఇలాంటి లోకల్ నాన్ లోకల్  నినాదం గట్టిగా వినిపిస్తోంది. ఈపార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పోటీదారులుగా చెప్పుకునే బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఇలా లోకల్, నాన్ లోకల్ వార్ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలో దింపింది కాంగ్రెస్. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి మంచి పలుకుబడి ఉంది.


 దీంతో ఇక విజయం సాధించడమే లక్ష్యంగా సునీత  మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. మరోవైపు బిజెపి నుంచి హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరులోకి దిగారు. ఆయన కూడా స్థానికేతర అభ్యర్థి. ఇక బిఆర్ఎస్ నుంచి మాత్రం రాగిడి లక్ష్మారెడ్డిని కెసిఆర్ బరిలోకి దింపారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి ఇక ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ లోకల్ నాన్ లోకల్ నినాదాన్ని ఎత్తుకున్నారు. స్థానికేతురులైన కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులను నమ్మితే మోసపోవడం తప్పదని.. నన్ను గెలిపిస్తే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను అంటూ లక్ష్మారెడ్డి ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. ప్రజలకు సేవ చేయడానికి లోకలేంటి నాన్ లోకల్ ఏంటి అని మిగతా పార్టీల అభ్యర్థులు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు అన్నది తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>