PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20243ea4072a-fe24-462d-8f2c-936de7a8632e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20243ea4072a-fe24-462d-8f2c-936de7a8632e-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..అత్యంత సీనియర్ నేత ఏకంగా టీడీపీ అధినేత ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు మాజీ మంత్రి అయిన గుండ అప్పల సూర్యనారాయణ సతీమణికి టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది.2014 వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచిన గుండ లక్ష్మీదేవికి ఈసారి టికెట్ ఇవ్వలేదు.దాంతో గుండ అప్పల సూర్యనారాయణ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలుగు దేశం పార్టీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు.అయితే టీడAP Elections 2024{#}Srikakulam;NTR;March;Minister;News;India;TDP;Party;Telugu Desam Partyఉత్తరాంధ్ర: ఎక్కువైన డిమాండ్లు.. టీడీపీకి పెద్ద దెబ్బే?ఉత్తరాంధ్ర: ఎక్కువైన డిమాండ్లు.. టీడీపీకి పెద్ద దెబ్బే?AP Elections 2024{#}Srikakulam;NTR;March;Minister;News;India;TDP;Party;Telugu Desam PartyFri, 05 Apr 2024 08:33:00 GMTఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..అత్యంత సీనియర్ నేత ఏకంగా టీడీపీ అధినేత ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు మాజీ మంత్రి అయిన గుండ అప్పల సూర్యనారాయణ సతీమణికి టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది.2014 వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచిన గుండ లక్ష్మీదేవికి ఈసారి టికెట్ ఇవ్వలేదు.దాంతో గుండ అప్పల సూర్యనారాయణ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలుగు దేశం పార్టీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు.అయితే టీడీపీ అధినాయకత్వంతో ఒకసారి మాట్లాడిన మీదటనే డెసిషన్ తీసుకుందామని మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ వారిని కూల్ చేశారు.తెలుగు దేశం పార్టీ పెద్దల పిలుపుతో ఆయన వెళ్లి మాట్లాడటం జరిగింది. అయితే అక్కడ ఏ ప్రతిపాదన చేశారో తెలియదు కానీ త్వరలో సంచలన నిర్ణయం తీసుకుంటా అని మాజీ మంత్రి అంటున్నారు. తెలుగు దేశం పార్టీ హై కమాండ్ కి పరిస్థితి మొత్తం చెప్పామని వారు కనుక పరిశీలించి న్యాయం చేస్తే సరే సరి. లేకపోతే తన సంచలన నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.టికెట్ ఖచ్చితంగా గుండ ఫ్యామిలీకి ఇవ్వాలన్నదే మాజీ మంత్రి డిమాండ్ గా ఉంది అంటున్నారు.


ఎమ్మెల్సీ ఇస్తామనో నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనో హామీలు ఇస్తే ఒప్పుకునే లేదని ఆయన ముందే చెప్పడం జరిగింది. ఇప్పటికే అక్కడ తెలుగు దేశం పార్టీ క్యాండిడేట్ ని ప్రకటించింది. అక్కడ మార్చి ఇవ్వడం అంటే అది ఆ సీటుకే పరిమితం కాదు. అన్ని చోట్ల నుంచి డిమాండ్లు అనేవి పుట్టుకుని వస్తాయి. అందువల్ల టికెట్ దక్కకపోవచ్చు అంటున్నారు. దాంతో మాజీ మంత్రి సంచలన నిర్ణయం దిశగానే అడుగులు వేస్తారు అని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసిందే. మాజీ మంత్రి శ్రీకాకుళం ఎంపీగా ఆయన సతీమణి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే శ్రీకాకుళం టీడీపీకి అతి పెద్ద దెబ్బ పడుతుందని సమాచారం తెలుస్తుంది. చూడాలి మరి తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>