PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7402a1fe-671c-4695-97de-67c1ee337bc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7402a1fe-671c-4695-97de-67c1ee337bc8-415x250-IndiaHerald.jpgమరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా... తెలుగుదేశం , బీజేపీ , జనసేన పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఇండియావ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఇండియా టుడే మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓ సర్వేను నిర్వహిస్తుంది. అందులో భాగంగా కొYcp{#}Parliment;television;Survey;Parliament;Janasena;YCP;Assembly;India;Bharatiya Janata Party;Telugu Desam Party;Andhra Pradeshఏపీ : వైసీపీ క్రేజ్ తగ్గిందా... ఆ సర్వేలో అమాంతం పడిపోయిన సీట్లు..!ఏపీ : వైసీపీ క్రేజ్ తగ్గిందా... ఆ సర్వేలో అమాంతం పడిపోయిన సీట్లు..!Ycp{#}Parliment;television;Survey;Parliament;Janasena;YCP;Assembly;India;Bharatiya Janata Party;Telugu Desam Party;Andhra PradeshFri, 05 Apr 2024 08:40:05 GMTమరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా... తెలుగుదేశం , బీజేపీ , జనసేన పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఇండియావ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఇండియా టుడే మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓ సర్వేను నిర్వహిస్తుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుంది అని తెలియజేశారు. అలాగే అలాగే తెలుగుదేశం , బీజేపీ , జనసేన కు కలిపి 5 నుంచి 8 వరకు పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే వారు నివేదించారు. ఇకపోతే తాజాగా ఈ సంస్థ వారు మరో సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి చాలా మొత్తంలో సీట్లు తగ్గాయి.

అసలు విషయం లోకి వెళితే ... తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం 12 స్థానాల వరకు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు , బీజేపీ మూడు స్థానాల వరకు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా వచ్చే పరిణామాలు లేనట్లు ఈ సంస్థ వారు తాజా నివేదికలో చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ పార్టీ పది స్థానాల వరకు గెలుపొందే అవకాశం ఉన్నట్లు ఈ సంస్థ వారు తాజా నివేదికలో చెప్పుకొచ్చారు. ఈ లెక్కల బట్టి చూస్తే మొదటి సర్వేలో 17 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇదే సంస్థ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం పది స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పింది. దానితో ఈ సంస్థ సర్వేలను నమ్మేవారు వైసీపీ పార్టీ క్రేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు తగ్గినట్లు భావిస్తున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>