MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa76b23439-5a0f-4c1e-8728-a50f07bedb6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa76b23439-5a0f-4c1e-8728-a50f07bedb6d-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇకపోతే ప్రస్తుతం "పుష్ప పార్ట్ 1" మూవీ కి కొనసాగిAa{#}anasuya bharadwaj;rao ramesh;sree;sukumar;Graphics;Anasuya;Allu Arjun;June;sunil;Tamil;Kannada;News;India;Music;Samantha;Heroine;rashmika mandanna;Hindi;Telugu;Cinemaఆ నెల చివరి నాటికి "పుష్ప 2" షూట్ కంప్లీట్..?ఆ నెల చివరి నాటికి "పుష్ప 2" షూట్ కంప్లీట్..?Aa{#}anasuya bharadwaj;rao ramesh;sree;sukumar;Graphics;Anasuya;Allu Arjun;June;sunil;Tamil;Kannada;News;India;Music;Samantha;Heroine;rashmika mandanna;Hindi;Telugu;CinemaFri, 05 Apr 2024 11:45:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇకపోతే ప్రస్తుతం "పుష్ప పార్ట్ 1" మూవీ కి కొనసాగింపుగా "పుష్ప పార్ట్ 2" సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పనులు అన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి కావడం కష్టమే అని దానితో ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల కాదు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను ఈ చిత్ర బృందం మాత్రం కచ్చితంగా ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే విధంగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే నెల చివరి వరకు "పుష్ప పార్ట్ 2" మూవీ కి సంబంధించిన అల్లు అర్జున్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే జూన్ నెల చివరి నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఈ చిత్ర బృందం ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ షూట్ చేయలేదు. ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ ను చివరన చిత్రీకరించే విధంగా మూవీ బృందం ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి గ్రాఫిక్స్ పనులు కూడా పెద్దగా ఉండవు అని తెలుస్తుంది.

దానితో ఈ సినిమాను ముందు చెప్పిన ఆగస్టు 15 వ తేదీనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అఫిషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>