MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjalif82cb698-0b82-4570-833c-6c23ab7f8d4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjalif82cb698-0b82-4570-833c-6c23ab7f8d4d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటేష్ , మహేష్ బాబు హీరో గా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుస తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా ఈ బ్యూటీ కెరియర్ ను కొనసాగించింది. ఇక మధ్యలో కొంత కాలం అంజలి ఎక్కువ తెలుగు సినిమాల్లో నటAnjali{#}geetanjali;mahesh babu;Diwali;Godavari River;Horror;Seethamma Vakitlo Sirimalle Chettu;Viswak sen;anjali;Genre;Beautiful;Event;Success;Box office;Tollywood;Pawan Kalyan;Telugu;BEAUTY;shankar;GEUM;Cinema;Venkateshఒకే సంవత్సరంలో మూడు సినిమాలతో అంజలి..!ఒకే సంవత్సరంలో మూడు సినిమాలతో అంజలి..!Anjali{#}geetanjali;mahesh babu;Diwali;Godavari River;Horror;Seethamma Vakitlo Sirimalle Chettu;Viswak sen;anjali;Genre;Beautiful;Event;Success;Box office;Tollywood;Pawan Kalyan;Telugu;BEAUTY;shankar;GEUM;Cinema;VenkateshFri, 05 Apr 2024 09:40:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటేష్ , మహేష్ బాబు హీరో గా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుస తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా ఈ బ్యూటీ కెరియర్ ను కొనసాగించింది.

ఇక మధ్యలో కొంత కాలం అంజలి ఎక్కువ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇక మళ్ళీ వరుసగా ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో నటిస్తోంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ గీతాంజలి అనే హర్రర్ కామెడీ జోనర్ లో రూపొందిన మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే మూవీని రూపొందించారు. ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటించింది.

సినిమా ఏప్రిల్ 11 వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం మే 17 వ తేదీన విడుదల కానుంది. వీటితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉంది.

సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అయినట్లు అయితే ఈ బ్యూటీ ఓకే సంవత్సరం మూడు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అవుతుంది. ఇక తాజాగా ఈ బ్యూటీఈవెంట్ లో మాట్లాడుతూ ... నేను గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్ ఆఫ్ గోదావరి , గేమ్ చెంజర్ అనే మూడు సినిమాలలో నటించాను. ఈ మూడింటిలో మొదటి అక్షరం "గ". అలాగే ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి తనకు హ్యాట్రిక్ విజయాలను అందిస్తాయి అని అంజలి ఆశాభావం వ్యక్తం చేసింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>