PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb76b628c-3fc9-434d-a96a-00fba2f850a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb76b628c-3fc9-434d-a96a-00fba2f850a3-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీపై మోజు పెంచుకుంటూ తన పార్టీ నేతలకు తనని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నట్టు జనసేన అభిమానులు కార్యకర్తలు మండిపడుతున్నారు.తన జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట పవన్‌ కల్యాణ్.అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అప్లై చేసిన పవన్ , రేపు పాలకొండలో కూడా తన పార్టీ వాళ్లకి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ ఇవ్వబోతున్నారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే నేతలకు టికెట్లిస్తూ పవన్‌ కళ్యాణ్ జనసేన అభిమానులకు నచ్చని డిఫరెంట్‌ సPawan Kalyan{#}Buddha Venkanna;Avanigadda;kalyan;Janasena;local language;India;Telugu Desam Party;TDP;News;Assembly;Partyటీడీపీ నేతలపై అంత మోజేంటి పవన్?టీడీపీ నేతలపై అంత మోజేంటి పవన్?Pawan Kalyan{#}Buddha Venkanna;Avanigadda;kalyan;Janasena;local language;India;Telugu Desam Party;TDP;News;Assembly;PartyFri, 05 Apr 2024 13:00:30 GMTపవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీపై మోజు పెంచుకుంటూ తన పార్టీ నేతలకు తనని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నట్టు జనసేన అభిమానులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. తన జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట పవన్‌ కల్యాణ్. అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అప్లై చేసిన పవన్ , రేపు పాలకొండలో కూడా తన పార్టీ వాళ్లకి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ ఇవ్వబోతున్నారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే నేతలకు టికెట్లిస్తూ పవన్‌ కళ్యాణ్ జనసేన అభిమానులకు నచ్చని డిఫరెంట్‌ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవనిగడ్డ టికెట్ ఆశించిన మండలి బుద్ధప్రసాద్‌.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో జనసేనలోకి జంప్‌ అయ్యారు. జనసేన నుంచి అవనిగడ్డ తరపున పోటి పడుతున్నారు. మండలి బుద్ధ ప్రసాద్‌ పోటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు పవన్‌ కళ్యాణ్. బుద్దా పార్టీలో చేరినప్పటి నుంచి అవనిగడ్డ జనసేన కోపంతో రగిలిపోతూ భగ్గుమంటోంది. జనసేన ఓటమికి పనిచేసినవారిని పార్టీలోకి పవన్ ఎలా తీసుకుంటారంటూ స్థానిక నేతల ఆందోళనలకు దిగారు.


గతకొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనగళం వినిపిస్తున్నారు. బుద్ధాకి అవనిగడ్డ సీటు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు పార్టీ శ్రేణులు. అయినప్పటికీ మండలి బుద్ధ ప్రసాద్‌ వైపే మొగ్గుచూపారు పవన్‌ కళ్యాణ్. పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఇటీవలే జనసేనలో చేరారు. పాలకొండ అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినా ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించలేదు. పాలకొండ నుంచి మొత్తం ఐదుగురు టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే జయకృష్ణకే టికెట్‌ ఖాయమన్న ప్రచారం కూటమి నాయకుల్లో ఉంది. రైల్వే కోడూరు సీటు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పవన్‌. యనమల భాస్కర్‌రావుకు బదులుగా ముక్కావారిపల్లె సర్పంచి అరవ శ్రీధర్‌కు సీటు కేటాయించారు. పవన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు జనసేన నేతలు. సీట్ల కోసం పార్టీలు మారిన వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారంటూ పవన్ పై మండిపడుతున్నారు. జనసేన పోలవరం అభ్యర్థి బాలరాజును కూడా మారుస్తున్నట్లు సమాచారం. ఇలా జనసేన కోసం ఇన్నేళ్లు కష్టపడ్డవారిని గుర్తించకుండా పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు, అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>