Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections30f265c9-4765-49cc-aa8b-7e2303a5a993-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections30f265c9-4765-49cc-aa8b-7e2303a5a993-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయం కాకరేపుతుంది..రాష్ట్రంలో మే 13 న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి.. అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ “మేమంతా సిద్ధం “. పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్ర ప్రారంభించారు. ప్రతి పక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం” పేరుతోఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు..ఈ ఐదేళ్ల లో వైసీపీ చేసిన మోసాలు గురించి తెలియజేస్తూ ప్రజలను #assembly elections{#}Adala Prabhakara Reddy;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Nellore;CBN;TDP;Assembly;MLA;MP;Party;Andhra Pradesh;bus;Jagan;YCPనెల్లూరు : రూరల్ లో ఈ సారి టీడీపీ గెలుపు ఖాయమేనా..?నెల్లూరు : రూరల్ లో ఈ సారి టీడీపీ గెలుపు ఖాయమేనా..?#assembly elections{#}Adala Prabhakara Reddy;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Nellore;CBN;TDP;Assembly;MLA;MP;Party;Andhra Pradesh;bus;Jagan;YCPFri, 05 Apr 2024 07:39:54 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయం కాకరేపుతుంది..రాష్ట్రంలో మే 13 న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి.. అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ “మేమంతా సిద్ధం “. పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్ర ప్రారంభించారు. ప్రతి పక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం” పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు..ఈ ఐదేళ్ల లో వైసీపీ చేసిన మోసాలు గురించి తెలియజేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అందులోను నెల్లూరు రూరల్ లో ఈసారి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది..2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది.ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో రెండుసార్లు వైసిపినే ఘన విజయం సాధించింది

.2014,2019 అసెంబ్లీ ఎన్నికలలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ కోటం రెడ్డిని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది.అయితే అంతకు ముందు నుంచే వైసీపీ పార్టీ పై అసంతృప్తిగా వున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనని వైసీపీ పార్టీ సస్పెండ్ చేయడంతో టీడీపీ లో చేరారు..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి తరుపున నెల్లూరు రూరల్ నుండి పోటీచేస్తున్నారు.వైసీపీ పార్టీఅసెంబ్లీ ఎన్నికలలో వైసిపి సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ పోటీలో నిలిపింది. దీనితో నెల్లూరు రూరల్ లో పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి టీడీపీ తరుపున గట్టిగా ప్రచారం చేస్తున్నారు.. ఈ సారి కూడా అత్యధిక మెజారిటీతో తానే గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.. వైసీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ సారి కూడా వైసీపీ పార్టీని గెలిపించి నెల్లూరు రూరల్ లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు.. మరి వీరిద్దరిలో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో తెలియాల్సి వుంది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>