EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf6d5a1e4-5c40-43e4-ba4c-f71c6ee7a450-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf6d5a1e4-5c40-43e4-ba4c-f71c6ee7a450-415x250-IndiaHerald.jpgఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన పూర్తి స్థాయిలో సినిమాల మీద కాకుండా రాజకీయాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలి వరకు పిఠాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అక్కడే ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఆయన తెనాలిలో పర్యటించాల్సి ఉంది. వారాహి సభ ద్వారా ప్రpawan{#}CBN;bus;politics;Pawan Kalyan;CM;Party;Hyderabadపవన్‌ కల్యాణ్‌: ఉస్సూరనిపిస్తున్న పవర్ స్టార్ ఫిట్ నెస్?పవన్‌ కల్యాణ్‌: ఉస్సూరనిపిస్తున్న పవర్ స్టార్ ఫిట్ నెస్?pawan{#}CBN;bus;politics;Pawan Kalyan;CM;Party;HyderabadFri, 05 Apr 2024 00:00:00 GMTఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన పూర్తి స్థాయిలో సినిమాల మీద కాకుండా రాజకీయాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలి వరకు పిఠాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


అక్కడే ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఆయన తెనాలిలో పర్యటించాల్సి ఉంది.  వారాహి సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినా అనూహ్యంగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటీన హైదరాబాద్ తిరిగి పయనమై వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్న పవన్ ర్యాలీలతో పాటు, ఇరవై కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇది వడదెబ్బకు కారణం అయింది. అస్వస్థతతోనే పిఠాపురంలో తన పర్యటన కొనసాగించిన పవన్ జ్వరం తీవ్రతరం అయ్యేవరకు తన కార్యకలాపాలు కొనసాగించారు.


అయితే పవన్ కల్యాణ్ అనారోగ్యంపై అభిమానులు పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి రాజుకొంది. అన్ని పార్టీలు తమ తమ రాజకీయ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. సీఎం జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టారు. చంద్రబాబు ప్రజాగళాన్ని ముందుండి మరీ నడిపిస్తున్నారు. రోజుకి మూడు నియోజకవర్గాలు తగ్గకుండా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పవన్ వారాహి విజయ భేరీ యాత్రను ప్రారంభించి ఇప్పుడు విరామం ప్రకటించారు.


ఈ సమయంలో పవర్ స్టార్ ఫిట్ నెస్ పై కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడు పదుల వయసులో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా మండు టెండలు సైతం లెక్క చేయకుండా ప్రజా గళం సభలు నిర్వహిస్తున్నారు. కానీ పవర్ స్టార్ మాత్రం ఆరోగ్య విషయంలో ఆపసోపాలు పడుతున్నారు. ఇంకా వేసవి ముదరక ముందే ఇలా ఉంటే ఏప్రిల్ , మేలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని జనసైనికులు కలవరపడుతున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>