PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-95a548bc-1639-4b52-b2bb-2fd536f9158b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-95a548bc-1639-4b52-b2bb-2fd536f9158b-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో వైసీపీ మంత్రి బొత్సాకి ఉన్న ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బొత్సాకి అక్కడ మామూలు క్రేజ్ లేదు.ఆయనకి ధీటుగా టికెట్ ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు తెలుగు దేశం పార్టీ కేటాయించింది. అయితే కళా వెంకటరావు ఎచ్చెర్ల టికెట్ ని ఆశించారు. కానీ చివరకు ఆయన చీపురుపల్లి వెళ్ళక తప్పింది కాదు.అయితే ఈ చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడింది కళా తమ్ముడు కొడుకు నాగార్జున.ఆయనకు అధినాయకత్వం హామీ ఇచ్చింది. వివాదం కొంత సర్దుకున్నాక పెద్దAP Elections {#}BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Uttarandhra;Etcherla;Tammudu;Vizianagaram;Thammudu;Akkineni Nagarjuna;Minister;Telugu Desam Party;Andhra Pradesh;YCP;CBN;TDP;Congressఉత్తరాంధ్ర: బొత్సాకి ధీటుగా ఆ టీడీపీ అభ్యర్థి?ఉత్తరాంధ్ర: బొత్సాకి ధీటుగా ఆ టీడీపీ అభ్యర్థి?AP Elections {#}BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Uttarandhra;Etcherla;Tammudu;Vizianagaram;Thammudu;Akkineni Nagarjuna;Minister;Telugu Desam Party;Andhra Pradesh;YCP;CBN;TDP;CongressFri, 05 Apr 2024 10:35:00 GMTఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో వైసీపీ మంత్రి బొత్సాకి ఉన్న ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బొత్సాకి అక్కడ మామూలు క్రేజ్ లేదు.ఆయనకి ధీటుగా టికెట్ ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు తెలుగు దేశం పార్టీ కేటాయించింది. అయితే కళా వెంకటరావు ఎచ్చెర్ల టికెట్ ని ఆశించారు. కానీ చివరకు ఆయన చీపురుపల్లి వెళ్ళక తప్పింది కాదు.అయితే ఈ చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడింది కళా తమ్ముడు కొడుకు నాగార్జున.ఆయనకు అధినాయకత్వం హామీ ఇచ్చింది. వివాదం కొంత సర్దుకున్నాక పెద్దాయన చీపురుపల్లిలో ల్యాండ్ అవ్వడం జరిగింది. బొత్స మీద ఖచ్చితంగా తన విజయం తధ్యమని ఆయన అంటున్నారు. వైసీపీ అరాచక పాలన ఏపీ నుంచి పోవడానికే బాబు కృషి చేస్తున్నారని అందుకే తనను కోరి మరీ చీపురుపల్లికి పంపించారు  అని కళా వెంకటరావు అంటున్నారు. తన తమ్ముడు కుమారుడు నాగార్జున తమ ఇంటి బిడ్డ అని అతని భవిష్యత్తుని తాను చూసుకుంటాను అని కళా అంటున్నారు.


ముందు వైసీపీని ఓడించడం తనకు చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు.ఆ పని తమ్ముడు కొడుకు చేయలేడని టికెట్ ఇచ్చారా అంటే పరిస్థితులు కారణం అంటున్నారు కళా వెంకట రావు. అసలు టికెట్ లేక కొంతమంది సీనియర్లు తెలుగు దేశం పార్టీలో కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కళా వెంకట రావుకు అలా జరగకుండా చీపురుపల్లి టికెట్ అయినా ఇచ్చారు అన్న సంతృప్తి ఆయనలో ఇంకా టీడీపీ క్యాడర్ లో ఉంది.అందుకే ఎచ్చెర్ల టికెట్ లేదని నొచ్చుకున్నా కూడా ఆనక అన్నీ గ్రహించి ఆయన చీపురుపల్లిలో పోటీకి రెడీ అయిపోవడం జరిగింది. చీపురుపల్లిలో వైసీపీ బొత్స సత్యనారాయణకు మంచి పట్టుంది. ఆయన కాంగ్రెస్ తరఫున ఏపీ విభజన తరువాత పోటీ చేసినా కూడా ఏకంగా యాభై వేల దాకా ఓట్లు వచ్చాయి. రెండు దశాబ్దాల నుంచి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ హవా సాగుతోంది. చివరి నిముషంలో వచ్చిన కళా వెంకటరావు బొత్స సత్యనారాయణను ఓడిస్తామని అంటున్నారు. ఆయన గెలుస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>