PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karnull-tdp-ycp9ab73351-d96f-47ee-a5e8-84e7e7a442fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karnull-tdp-ycp9ab73351-d96f-47ee-a5e8-84e7e7a442fe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరో 36 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అటు అధికార పార్టీ మరొకవైపు కూటమిగా ఏర్పడిన బిజెపి, తెదేపా , జనసేన పార్టీలు ఎవరికి వారు అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ఆ స్థానాలలో తాము గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో ఈ పార్టీలకు కొన్ని సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్యKARNULL;TDP;YCP{#}Prakasam;Nandikotkur;SV Mohan Reddy;Yemmiganur;Kurnool;Doctor;AdiNarayanaReddy;Suresh;Pulivendula;MLA;Janasena;Telugu Desam Party;Party;YCP;Parliament;Elections;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;Minister;local languageరాయలసీమ: స్థానం ఒకరిది.. అధిష్టానం మరొకరిది.. ఎవరికి కలిసొచ్చేను..?రాయలసీమ: స్థానం ఒకరిది.. అధిష్టానం మరొకరిది.. ఎవరికి కలిసొచ్చేను..?KARNULL;TDP;YCP{#}Prakasam;Nandikotkur;SV Mohan Reddy;Yemmiganur;Kurnool;Doctor;AdiNarayanaReddy;Suresh;Pulivendula;MLA;Janasena;Telugu Desam Party;Party;YCP;Parliament;Elections;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;Minister;local languageFri, 05 Apr 2024 09:14:16 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరో 36 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అటు అధికార పార్టీ మరొకవైపు కూటమిగా ఏర్పడిన బిజెపి, తెదేపా , జనసేన పార్టీలు ఎవరికి వారు అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ఆ స్థానాలలో తాము గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో ఈ పార్టీలకు కొన్ని సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసీపీ,  ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్య వెంటాడుతోంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానం ఒకరిది అయితే అధిష్టానాన్ని మరొకరికి కట్టబెడుతున్నారనే వార్త తెరపైకి వచ్చింది.. అందుకే అక్కడివారు నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు.

కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ నగరానికి కొత్త అయితే ఎన్నికలలో పోటీకోసమే ఐఏఎస్ పదవికి రిజైన్ చేసి.. ఎన్నికలలో ఆయన పాల్గొంటున్నారు.. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ , మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇప్పించకుండా ఉండడం కోసం పలు ప్రయత్నాలు చేశారు.

మరొకవైపు కోడుమూరు వైసిపి అభ్యర్థి డాక్టర్ సతీష్ సొంతూరు కర్నూలు జిల్లానే కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు మంత్రి ఆదిమూలపు సురేష్ కి స్వయాన సోదరుడు.. ఆయనకి కోడుమూరు టికెట్ రావడంతో టికెట్ ఆశించి.. భంగపడిన దాదాపు పది మంది నేతలు నాన్ లోకల్ సమస్యను తెరపైకి తీసుకొస్తున్నారు.

మరొకవైపు ఎమ్మిగనూరులో కూడా వైసీపీలో కొంత నాన్ లోకల్ సమస్య ఏర్పడింది.  బుట్టా రేణుకది ఎమ్మిగనూరు సొంత ఊరు కాదు... అయితే రేణుక ఎంపీగా పనిచేసిన కర్నూల్ పార్లమెంటు పరిధిలోనే ఎమ్మిగనూరు ఉంది.. దీంతో ఇది నాన్ లోకల్ కిందకి రాదు అని ఆమె మరోపక్క వాదిస్తున్నారు.

 అలాగే ఇంకొక వైపు ఆదోనిలో కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ఈ స్థానాన్ని తెలుగుదేశం , బిజెపికి కేటాయించగా డాక్టర్ పార్థసారథి బిజెపి తరఫున అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు.. పార్థసారథి కూడా నాన్ లోకల్ అని టిడిపి టికెట్ ఆశించి ఇక్కడికి రాగా దీనిపై కూడా టిడిపి అధిష్టానం దూతలను పంపి వివరణ ఇప్పిస్తున్నారు..

 నందికొట్కూరు వైసిపి అభ్యర్థిగా డాక్టర్ సుదీర్ ని పార్టీ ప్రకటించింది.. ఇతడిది కూడా నాన్ లోకల్.. ఉమ్మడి కర్నూలు జిల్లా నే కాదు.. పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి.. గతంలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పైన పోటీ చేసి గెలుపొందారు.. కానీ ఇప్పుడు నాన్ లోకల్ టికెట్ ఇచ్చారంటూ.. వైసీపీ నందికొట్కూరు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ నాన్ లోకల్ సమస్య అటు టీడీపీ కి ఇటు వైసీపీ కి పెద్ద తలనొప్పిగా మారింది.. మరి ఎవరికి ఏ రకంగా కలిసొస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>