PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-pawan-kalyan-jensenac5ca9581-c690-4df1-95ae-97735cd1854c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-pawan-kalyan-jensenac5ca9581-c690-4df1-95ae-97735cd1854c-415x250-IndiaHerald.jpgజనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టిడిపితో పొత్తుకు బిజెపిని ఒప్పించడానికి బిజెపి నేతల నుంచి ముప్పుతిప్ప‌లు ప‌డుతోన్న పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో టిడిపి శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టిడిపి నేతను ఉద్దేశAP-Assembly-Elections, AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024, pawan kalyan, jensena{#}Ram Gopal Varma,geetha,mithra,Pawan Kalyan,C M Ramesh,Sujana Choudary,Rajahmundry,pithapuram,Government,Vijayawada,choudary actor,Yatra,Anakapalle,CBN,Janasena,MLA,TDP,Bharatiya Janata Party,Partyపవన్ చేతుల్లో ఏమీ లేదిక... అన్నీ అందరి చేతుల్లో పెట్టేసిన‌ట్టే..!పవన్ చేతుల్లో ఏమీ లేదిక... అన్నీ అందరి చేతుల్లో పెట్టేసిన‌ట్టే..!AP-Assembly-Elections, AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024, pawan kalyan, jensena{#}Ram Gopal Varma,geetha,mithra,Pawan Kalyan,C M Ramesh,Sujana Choudary,Rajahmundry,pithapuram,Government,Vijayawada,choudary actor,Yatra,Anakapalle,CBN,Janasena,MLA,TDP,Bharatiya Janata Party,PartyFri, 05 Apr 2024 11:48:00 GMTజనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టిడిపితో పొత్తుకు బిజెపిని ఒప్పించడానికి బిజెపి నేతల నుంచి ముప్పుతిప్ప‌లు ప‌డుతోన్న పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో టిడిపి శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టిడిపి నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించడం పై ట్రోలింగ్ జరుగుతోంది.


జనసేన పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నారు?
తన సొంత నియోజక వర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలాగ ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్ధులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టిడిపి-బిజెపి అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనూ  ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఒక వైపే చూస్తున్నారు. రెండో వైపు చూడ‌డానికి భ‌య‌మా ? లేదా పెట్ట‌లేక‌పోతున్నాడో కూడా అర్ధం కాని ప‌రిస్థితి.


పిఠాపురం సీటును ఆయన ఎంచుకోడానికి కారణం ఆ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడమే. కులాలు లేవు మతాలు లేవు అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తమ కులం ఓట్లకోసమే పిఠాపురం ఎంచుకున్నారని టిడిపి సీనియర్లే అంటున్నారు. పిఠాపురంలో    పవన్ కల్యాణ్ కు  ఏదీ కలిసి రావడం లేదు. ఎవరూ  కదలి రావడం లేదు. పిఠాపురం లో టిడిపి రెబెల్ వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన అయిష్టంగా పవన్ కు మద్దతుగా ఉంటానని అన్నారు. అయితే మాటలు చెప్పినంత జోరుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం లేదు.


దూసుకుపోతోన్న వంగా గీత‌...
పిఠాపురం నియోజక వర్గంలో  పాలక పక్ష అభ్యర్ధి  వంగాగీత దూసుకుపోతున్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లోనూ మంచి పేరు ఉండడమే కాకుండా అన్ని వర్గాలూ ఆమెకు అండగా ఉన్నాయి. వాటిని మించి ప్రభుత్వం అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు..అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాయి. అవే తనని గెలిపిస్తాయని గీత ధీమాగా ఉన్నారు. ఆమెకు సౌమ్యురాలు అన్న పేరు ఉంది. గ‌తంలో కూడా ఇక్క‌డ ప్ర‌జారాజ్యం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు.


ప‌వ‌న్ ముందుగానే ఓట‌మి ఒప్పుకున్నాడా ?
ఇటీవ‌లే జ‌న‌సేనాని  పవన్  ఓ వేదికపై   మిత్ర పక్షం టిడిపి  నాయకుడు అయిన వర్మని ఉద్దేశించి నా విజయం బాధ్యతలు మీ చేతుల్లో పెడుతున్నా అన‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే ప‌వ‌న్ త‌న ఓట‌మిని ముందుగానే ఒప్పుకున్నట్లు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి.. ఆ పార్టీ తరపున మిగతా అభ్యర్ధుల నియోజక వర్గాలు పట్టించుకోకుండా కేవలం తన సొంత నియోజక వర్గానికే పరిమితం అయిన పవన్ కల్యాణ్ కనీసం తనని తాను గెలిపించుకునే పరిస్థితిలో లేరు కాబట్టే వర్మలాంటి ఊతకర్రలకోసం వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది.


ప‌వ‌న్ చాలా మందిని చాలా చేతుల్లో పెట్టేశారే..!
ఇక ప‌వ‌న్ తన విజయాన్ని వర్మ చేతిలో పెట్టడం మాత్ర‌మే కాదు.. చాలా  వాటిని చాలా మంది చేతుల్లో పెట్టారు. తన జనసేన పార్టీ స్టీరింగ్ ని  చంద్రబాబు చేతుల్లో ... తన పార్టీకి రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యతను బిజెపి చేతుల్లో... తన పార్టీ టికెట్లను టిడిపి  నేతల చేతుల్లో.. తన అన్న నాగబాబుకు ఇస్తానన్న అనకాపల్లి సీటును సిఎం రమేష్ చేతుల్లో... పార్టీలో సీనియర్ అయిన పోతిన మహేష్ కు ఇవ్వాల్సిన విజయవాడ వెస్ట్ సీటును సుజనా చౌదరి చేతుల్లో పెట్టారు. ఇక రాజమండ్రి రూరల్ సీటును బుచ్చయ్య చౌదరి చేతుల్లో పెట్టార‌ని  సెటైర్లు పేలుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>