PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-bharath-chandrababu3bad5ff5-39f4-48c1-9062-3066eeebbd01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-bharath-chandrababu3bad5ff5-39f4-48c1-9062-3066eeebbd01-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ మధ్య చాలా రసవత్తరంగా ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ సీఎం జగన్.. వైనాట్ -175 నుంచి వై నాట్ డబుల్ సెంచరీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు కూడా వై నాట్ పులివెందుల అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు.. కుప్పం నియోజకవర్గంలో నీళ్లు తెప్పించిన ఘనత తమ పార్టీదే అంటూ .. కుప్పం ప్రజలకు మంచి చేశామంటూ సీఎం జగన్ ఇటీవలే బస్సు యాత్రలో చెప్పడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. ప్రస్తుతం కుప్పం నుంచీ చంద్రబాబు మీద భరత్ అనే వ్యక్తిని పోటీగా నిలబెట్టkuppam bharath;CHANDRABABU{#}CBN;bharath;naina;Telugu Desam Party;Sri Bharath;bus;kuppam;CM;TDP;News;Pulivendula;Andhra Pradesh;Elections;Party;YCPతిరుపతి: కుప్పం గ్రౌండ్ రిపోర్టు.. చంద్రబాబు వన్ సైడ్ వార్ అనుకోవ‌ద్దు.. అదే ట్విస్ట్‌..?తిరుపతి: కుప్పం గ్రౌండ్ రిపోర్టు.. చంద్రబాబు వన్ సైడ్ వార్ అనుకోవ‌ద్దు.. అదే ట్విస్ట్‌..?kuppam bharath;CHANDRABABU{#}CBN;bharath;naina;Telugu Desam Party;Sri Bharath;bus;kuppam;CM;TDP;News;Pulivendula;Andhra Pradesh;Elections;Party;YCPThu, 04 Apr 2024 12:30:26 GMTరాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ మధ్య చాలా రసవత్తరంగా ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ సీఎం జగన్.. వైనాట్ -175 నుంచి వై నాట్ డబుల్ సెంచరీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు కూడా వై నాట్ పులివెందుల అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు.. కుప్పం నియోజకవర్గంలో  నీళ్లు తెప్పించిన ఘనత తమ పార్టీదే అంటూ .. కుప్పం ప్రజలకు మంచి చేశామంటూ సీఎం జగన్ ఇటీవలే బస్సు యాత్రలో చెప్పడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. ప్రస్తుతం కుప్పం నుంచీ చంద్రబాబు మీద భరత్ అనే వ్యక్తిని పోటీగా నిలబెట్టారు సీఎం జగన్.



ఇండియా  హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం.. ఈసారి కుప్పంలో వైసిపి పార్టీ , టిడిపి పార్టీని చాలా దెబ్బతీసేలా చేస్తోందట.. మరి ఈ ప్రభావం టిడిపి పార్టీ మీద ఎంత ఉంటుంది? చంద్రబాబు మీద ఎలా ఉంటుంది? ఎంత మెజారిటీ వస్తుందనే విషయానికి వస్తే.. కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీ మాత్రం ఇంటర్నల్ గా ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున టిడిపి నాయకులు కొంతమంది.. వీరితో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ లతో సహా కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలోకి జాయిన్ అయ్యారు. అందుకే వైసిపి పార్టీ కేవలం కుప్పంలో ఒకే ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తోందట.


ఇండియా  హెరాల్డ్ కి అందిన సమాచారం మేరకు.. కుప్పంలో వైసీపీ పార్టీ పూర్తిగా డబ్బులు కుమ్మరిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు విలువ కడుతున్నట్లు తెలుస్తోంది.. అయితే అక్కడ నాయకులను బట్టి ఓటర్లను బట్టి లెక్కగడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ మారాలంటే.. బలహీనతల మీద దెబ్బేస్తున్నారట.. ఇది కొంతమంది సీనియర్ నేతలు చేస్తున్న స్ట్రాంగ్ ఆపరేషన్ అన్నట్లుగా సమాచారం.

ఈ విషయంతో టీడీపీ పార్టీ కూడా కుప్పంలో అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది.. గడిచిన ఏడాది క్రితం సైలెంట్ గా టిడిపి ప్రభుత్వం కూడా గ్రౌండ్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళింది.. ఈసారి చంద్రబాబు మెజారిటీ 40 నుంచి 50 వేలకు ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు.. అలాగే నాయకులని కాపాడుకుంటూ ఓటర్లను కూడా కలుస్తున్నారు టిడిపి నాయకులు.. ఇలా బూత్ లెవల్ నుంచి టిడిపి పార్టీ స్ట్రాంగ్ అవుతున్న సమయంలో వైసీపీ పార్టీ మళ్లీ వీక్ చేస్తున్నారట. ఉదాహరణకు టిడిపి పార్టీలో 10 మంది ఓటర్లు ఉంటే వారిలో నలుగురిని వైసీపీ పార్టీనే కొనేస్తోందట.. గత రెండు నెలలుగా ఇదే జరుగుతున్నట్లు సమాచారం.


ముఖ్యంగా పెద్దిరెడ్డి.. కుప్పంలో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక టీమ్ ను మెయింటైన్ చేస్తూ.. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని సమాచారం. అలాగే ఓటర్లకు , వాలంటరీలకు కూడా గిఫ్ట్లు వెళ్లాయని సమాచారం.. ఇంకా రెండు దశలలో డబ్బును పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా టిడిపిని కుప్పంలో ఓడించడం సాధ్యం కాకపోయినా మెజారిటీ నైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాయకులు , ఓటర్లకు ఏదైనా చేయగలిగే సత్తా ఉందని.. వైసీపీ పార్టీ వనరులు కూడా  పుష్కలంగా ఉన్నాయని... టిడిపి దగ్గర అవి లేవని తెలుస్తోంది.. మరి వైసిపి పన్నుతున్న పన్నాగం టిడిపికి ఎంతవరకు నష్టాన్ని కలిగిస్తుందో చూడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>