PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20245073ea9b-ab5b-4d2f-8c5b-c17bf7bcfb59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20245073ea9b-ab5b-4d2f-8c5b-c17bf7bcfb59-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ తమ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తుంది. తాజాగా పార్టీ విష‌యంలో కొత్త ప్ర‌చారం ఊపందుకుంటోంది. నామినేష‌న్ల‌కు కొంచెం గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న పొందిన కొంతమంది అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు నాయుడు మార్చ‌బోతున్నార‌నే సమాచారం తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో కొందరి అభ్య‌ర్థుల విష‌యంలో ర‌చ్చ రచ్చ జరిగింది. ప‌లు చోట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద‌కే ఆ పార్టీ క్యాడ‌ర్ దాడికి దిగింది. చంద్ర‌ బాబు నాయుడు ఫొటోల‌ను చెప్పుల‌తో కొడుతూ తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు త‌మ‌దైన మార్కు నిరAP Elections 2024{#}Raccha;CBN;Telugu Desam Party;News;District;TDP;Party;Teluguచెప్పు దెబ్బలు కొట్టినోళ్ళకి అభ్యర్థిత్వాలేంటి చంద్రన్న?చెప్పు దెబ్బలు కొట్టినోళ్ళకి అభ్యర్థిత్వాలేంటి చంద్రన్న?AP Elections 2024{#}Raccha;CBN;Telugu Desam Party;News;District;TDP;Party;TeluguThu, 04 Apr 2024 11:20:01 GMTతెలుగుదేశం పార్టీ తమ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తుంది. తాజాగా పార్టీ విష‌యంలో కొత్త ప్ర‌చారం ఊపందుకుంటోంది. నామినేష‌న్ల‌కు కొంచెం గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న పొందిన కొంతమంది అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు నాయుడు మార్చ‌బోతున్నార‌నే సమాచారం తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో కొందరి అభ్య‌ర్థుల విష‌యంలో ర‌చ్చ రచ్చ జరిగింది. ప‌లు చోట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద‌కే ఆ పార్టీ క్యాడ‌ర్ దాడికి దిగింది. చంద్ర‌ బాబు నాయుడు ఫొటోల‌ను చెప్పుల‌తో కొడుతూ తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు త‌మ‌దైన మార్కు నిర‌స‌న‌ను వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని చోట్ల అయితే జిల్లా ఆఫీసుపై ఒక సారి, నియోజ‌క‌వ‌ర్గం ఆఫీసుపై మ‌రోసారి, టౌన్ ఆఫీసుపై ఇంకోసారి దాడులు చేసి మ‌రీ నిర‌స‌న‌లు తెలిపారు ప‌చ్చ చొక్కలేసుకున్న తెలుగు తమ్ముల్లు. ఎక్క‌డ చంద్ర‌బాబు ఫొటోలు క‌నిపించినా కూడా చెప్పుల‌తో కొడుతూ వారు నిర‌స‌న‌లు దిగుతుండ‌టం టీడీపీ అభిమానులకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది.అలాగే చాలా చోట్ల బాబు ఎంపిక చేసిన అభ్య‌ర్థులు ఆశ్చ‌ర్యాన్ని గొలుపుతున్నార‌నే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అసలు నియోజ‌క‌వ‌ర్గంలో సామాన్యుల‌కు ఎవ‌రో కూడా తెలీని వారిని అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించార‌నే ఆశ్చ‌ర్యాలు ఇప్పటికీ కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులు త‌ప్ప‌వ‌నే వార్తలు వచ్చాయి.


క‌నీసం ఏడెనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల మార్పు ఉండ‌బోతోంద‌నే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా కానీ  మార్పులు అయితే పక్కా ఉంటాయ‌నే టాక్ న‌డుస్తోంది. ఏడెనిమిది చోట్ల మార్పుల‌పై చంద్ర‌బాబు నాయుడు నుంచి ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌వ‌చ్చ‌నే రూమ‌ర్లు బలంగా వినిపిస్తున్నాయి. మ‌రి అదే జ‌రిగితే మళ్ళీ కొత్త గంద‌ర‌గోళానికి తెర‌లేచే అవ‌కాశాలూ ఉన్నాయి.ఆల్రెడీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న నేపథ్యంలో.. అభ్య‌ర్థిత్వం పొందిన వారైనా హుషారుగా ప్ర‌చారం చేసుకుంటూ పోతుంటారు. అలాంటిది ఇప్పుడు కొత్త మార్పు అంటే .. ఆల్రెడీ బ‌జారుకు ఎక్కిన వారికి మ‌ళ్లీ బాధ్యత ఇచ్చిన‌ట్టుగా అవుతుంది. ఏకంగా టీడీపీ చంద్ర‌బాబు నాయుడు ఫొటోల‌కు చెప్పు దెబ్బ‌లు కొట్టిన వారికి అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేసిన‌ట్టుగా అవుతుంది. అయినా కానీ మార్పులు ఆగేదేలే అనే ప్రచారం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చెప్పు దెబ్బలు కొట్టిన వాళ్లకి అభ్యర్థిత్వాలు ఏంటి చంద్రన్న అంటూ టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అసలేం జరుగుతుంది? ఏం జరగబోతుంది? మాకు తెలియాలి అని సోషల్ మీడియాలో టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>