PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gv-letest-update-political-newsd98ba7e4-beb9-4555-aac0-6037f8719b5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gv-letest-update-political-newsd98ba7e4-beb9-4555-aac0-6037f8719b5e-415x250-IndiaHerald.jpgలోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ పార్టీ సీనియర్ నాయకులంతా వేరే పార్టీలోకి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు అయినటువంటి అశోక్ చవాన్ , మిలింద్ దేవరా వంటి ప్రముఖ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేతిని వదిలేశారు. తాజాగా ఈ పార్టీ నుండి మరో నాయకుడు కూడా వెళ్లిపోయాడు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అందుకు సంబంధించిన లGv{#}gourav;sampada;Bari;Ashok Shankarrao Chavan;రాజీనామా;Bharatiya Janata Party;Hanu Raghavapudi;Assembly;Elections;Congress;Partyముంబై : కాంగ్రెస్ చేతిని వదిలేసిన మరో సీనియర్ లీడర్..!ముంబై : కాంగ్రెస్ చేతిని వదిలేసిన మరో సీనియర్ లీడర్..!Gv{#}gourav;sampada;Bari;Ashok Shankarrao Chavan;రాజీనామా;Bharatiya Janata Party;Hanu Raghavapudi;Assembly;Elections;Congress;PartyThu, 04 Apr 2024 14:27:34 GMTలోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ పార్టీ సీనియర్ నాయకులంతా వేరే పార్టీలోకి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు అయినటువంటి అశోక్ చవాన్ , మిలింద్ దేవరా వంటి ప్రముఖ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేతిని వదిలేశారు. తాజాగా ఈ పార్టీ నుండి మరో నాయకుడు కూడా వెళ్లిపోయాడు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన లేఖను కూడా ఈయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో తాజాగా పోస్ట్ చేశారు. అందులో ఈయన... పార్టీ ఏ దిశకు వెళుతోందో కూడా తెలియడంలేదని, అది నాకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని కూడా స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను నేను నిందించలేనని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకి , ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో కూడా పార్టీ బాగా దెబ్బతిన్నదని అని గౌరవ్ అన్నారు. కార్యకర్తలకు , నాయకులకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దానిని తగ్గించడం కూడా కష్టంగా మారిందని వెల్లడించారు. కిందిస్థాయి నాయకులు , కార్యకర్తలు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదన్నారు. 2019 లో జార్ఖండ్‌ లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన ఈయన అందులో ఓడిపోయారు.  

జెంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ స్థానం నుంచి బరికలోకి దిగిన గౌరవ్ 18 వేల ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.  2023 లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గౌరవ్‌ ఓడిపోయారు. ఉదయ్‌పూర్‌ నియోజకవర్గంలో ఆయనపై బీజేపీ అభ్యర్థి 32 వేల బారి ఆధిక్యంతో విజయం సాధించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>