Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chabdrababua47876d3-f7ce-45fd-a41d-b7b703600a42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chabdrababua47876d3-f7ce-45fd-a41d-b7b703600a42-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం వాడి వేడిగా మారిపోయింది. సీఎం కుర్చీని దక్కించుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు.. ఈసారైనా ఉనికిని చాటుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పొత్తుతో నైనా తమకు కలిసి వస్తుందేమో అనే ఆశతో బిజెపి ఇక ఒకటిగా ముందుకు సాగుతున్నాయి. ఇంకోవైపు సింహం ఎప్పుడూ సింగిల్గానే బరిలోకి దిగుతుంది అనే కాన్సెప్ట్ తో వైసిపి ఎలాంటి పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఇక రెండోసారి కుర్చీలో తానే కూర్చునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. ఇంకోవైపు ఏChabdrababu{#}naina;Arundhati;Parliment;lion;Janasena;Sharmila;pasupathi;Bharatiya Janata Party;Jagan;CM;CBN;YCP;Andhra Pradesh;TDPనేను పశుపతినే.. తన నిజస్వరూపం ఏంటో చెప్పిన చంద్రబాబు?నేను పశుపతినే.. తన నిజస్వరూపం ఏంటో చెప్పిన చంద్రబాబు?Chabdrababu{#}naina;Arundhati;Parliment;lion;Janasena;Sharmila;pasupathi;Bharatiya Janata Party;Jagan;CM;CBN;YCP;Andhra Pradesh;TDPThu, 04 Apr 2024 10:00:00 GMTఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం వాడి వేడిగా మారిపోయింది. సీఎం కుర్చీని  దక్కించుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు.. ఈసారైనా ఉనికిని చాటుకోవాలని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పొత్తుతో నైనా  తమకు కలిసి వస్తుందేమో అనే ఆశతో బిజెపి ఇక ఒకటిగా ముందుకు సాగుతున్నాయి. ఇంకోవైపు సింహం ఎప్పుడూ సింగిల్గానే బరిలోకి దిగుతుంది అనే కాన్సెప్ట్ తో వైసిపి ఎలాంటి పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఇక రెండోసారి కుర్చీలో తానే కూర్చునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు.


 ఇంకోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల తెలంగాణలో ఎలాగో కలిసి రాలేదు.. కనీసం ఆంధ్రలోనైనా కలిసి వస్తుందో లేదో అని అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. సొంత అన్న పైన పోటీకి రెడీ అయింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇక  అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే ఒక బహిరంగ సభలో జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు సంచలనంగా మారిపోయాయ్. అరుంధతి సినిమాలో పశుపతి లాగానే ఇప్పుడు పసుపుపతి సమాధిలోంచి లేచి వదలబొమ్మాలి వదల అంటున్నాడు అంటూ సెటైర్లు వేశాడు జగన్.


 ఇలా టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ వేసిన సెటైర్లపై.. చంద్రబాబు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. తనను సీఎం జగన్ పశుపతి అంటున్నాడని.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడని టిడిపి చీఫ్ చంద్రబాబు అన్నారు. తాను రాష్ట్రాన్ని కాపాడటానికి శివుడి అవతారం ఎత్తాను  అంటూ చెప్పుకోచాడు. వాలంటీర్లను  వ్యతిరేకించడం లేదు. వారు రాజకీయం చేయడానికి మాత్రమే నేను వ్యతిరేకం. వారు 50,000 సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా. వైసిపి ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. అందుకే ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది అంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>