PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20248cbd0832-fde3-4ea5-9604-a5cd2569caa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20248cbd0832-fde3-4ea5-9604-a5cd2569caa0-415x250-IndiaHerald.jpgకూటమిలో భాగంగా టీడీపీ రాజకీయంతో విశాఖ సీటు బీజేపీకి కాకుండా పోయింది. బీజేపీ జాతీయ పెద్దలు ఎంత ట్రై చేసినా కానీ విశాఖ ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్ర బాబు ససేమిరా అన్నట్లుగా ప్రచారం సాగింది. దానికి బదులుగా అనకాపల్లి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. దాంతో ఇష్టం లేకపోయినా కానీ దాన్ని బీజేపీ తీసుకుంది. అయితే ఆ సీటులో అప్పటికే విశాఖ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న సీఎం రమేష్ ని పోటీకి దింపాలనుకోవడమే ఒక తప్పుడు నిర్ణయం అని టాక్ నడుస్తుంది.అనకాపల్లి పార్లమెంట్ లో రాజకీయ చరిత్రలో గెలుపు చూసుకుంటే ఎపుడూAP Elections 2024{#}CBN;Bharatiya Janata Party;Telugu Desam Party;Velama;Janasena;Anakapalle;Vishakapatnam;Parliment;king;News;local language;Ishtam;Narsapuram;Party;media;CM;Telangana Chief Minister;MLA;TDP;YCPవిశాఖ: కూటమి కష్టాలు మాములుగా లేవుగా?విశాఖ: కూటమి కష్టాలు మాములుగా లేవుగా?AP Elections 2024{#}CBN;Bharatiya Janata Party;Telugu Desam Party;Velama;Janasena;Anakapalle;Vishakapatnam;Parliment;king;News;local language;Ishtam;Narsapuram;Party;media;CM;Telangana Chief Minister;MLA;TDP;YCPThu, 04 Apr 2024 12:37:13 GMTకూటమిలో భాగంగా టీడీపీ రాజకీయంతో విశాఖ సీటు బీజేపీకి కాకుండా పోయింది. బీజేపీ జాతీయ పెద్దలు ఎంత ట్రై చేసినా కానీ విశాఖ ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్ర బాబు ససేమిరా అన్నట్లుగా ప్రచారం సాగింది. దానికి బదులుగా అనకాపల్లి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. దాంతో ఇష్టం లేకపోయినా కానీ దాన్ని బీజేపీ తీసుకుంది. అయితే ఆ సీటులో అప్పటికే విశాఖ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న సీఎం రమేష్ ని పోటీకి దింపాలనుకోవడమే ఒక తప్పుడు నిర్ణయం అని టాక్ నడుస్తుంది.అనకాపల్లి పార్లమెంట్ లో రాజకీయ చరిత్రలో గెలుపు చూసుకుంటే  ఎపుడూ లోకల్స్  గెలుస్తూ వచ్చారు. అనకాపల్లి మీద ఆశపడి ఎవరైనా వచ్చినా వారికి ఓటమి దక్కిన సంగతీ చరిత్రలో ఉంది. అయితే ఇవన్నీ తెలిసి కూడా రమేష్ ని పంపించారు. ఇక కూటమి కష్టాలు లెక్కలేనన్ని అని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూస్తేనే స్పష్టంగా అర్ధం అవుతుంది. మాజీ మంత్రులు అలగడం, కొందరు సీట్లు లేక మౌనం దాల్చడం ఇంకా జనసేన బీజేపీ టీడీపీల మధ్య సయోధ్య లేకపోవడం వంటి అసంతృప్తులు  చాలా ఉన్నాయి. దాంతో రమేష్ ముందుగా టీడీపీ పెద్దలను కలుసుకుని వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేశారు.ఎన్ని చేసినా కూడా గ్రౌండ్ లెవెల్ లో లోకల్ కార్డు తో వైసీపీ వస్తోంది. ఇక బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది.


బూడి  మోడల్ నియోజకవర్గంగా మాడుగులను అభివృద్ధి చేశారు.అందువల్ల ఆయన అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో కూటమిలో కూడా కొంత చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ సీటు విషయంలో బీజేపీ అధినాయకత్వం టీడీపీల మధ్య మార్పు చేర్పులు సాగుతున్నాయని సమాచారం తెలుస్తుంది. దాంతో పనిలో పనిగా అనకాపల్లి సీటుకు బదులు విశాఖ సీటుని తీసుకోవాలని సీఎం రమేష్ పార్టీ పెద్దల వద్ద వినతి చేసుకుంటున్నారు అని సమాచారం తెలుస్తుంది.ఈ విషయాన్ని ఎలమంచిలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు మీడియా ముఖంగా తెలిపారు.సీఎం రమేష్ అనకాపల్లి సీటు వద్దని పార్టీ పెద్దల వద్ద చెబుతున్నారని ఆయన అంటున్నారు. దాంతో అది నిజమేనా కాదా అన్న చర్చకు కూడా తెర లేచింది. మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ విశాఖ మీద మళ్లీ మనసు పడుతున్నారని అంటున్నారు.


చంద్రబాబు నాయుడు కూడా నర్సాపురం సీటుని తీసుకుని రఘురామ క్రిష్ణం రాజు చేత పోటీ చేయించాలని భావిస్తున్నారు. విశాఖ సీటుని టీడీపీ వదులుకుని బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోందని అంటున్నారు. విశాఖ బీజేపీ శాఖ కూడా విశాఖ సీటు మీదనే పట్టుబడుతోంది. జేపీ నడ్డాకు ఒక తీర్మానాన్ని చేసి పంపించింది. దీంతో రమేష్ కూడా అలా కోరి ఉంటారని అంటున్నారు. మరి టీడీపీ కనుక అంగీకరిస్తే విశాఖ సీటు బీజేపీకి రావచ్చు. విశాఖ సీటు బీజేపీకి ఇస్తే జీవీఎల్ నరసింహారావు ఆ సీటు కోరుకుంటున్నారు. మరి సీఎం రమేష్ కే ఆ సీటు ఇస్తారా లేక అభ్యర్ధి మార్పు కూడా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>