PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/junior-ntrc7c616c9-a1cc-45bc-a766-8e0178883ac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/junior-ntrc7c616c9-a1cc-45bc-a766-8e0178883ac9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయగా ఆ సమయంలో తారక్ ప్రచారం చేసిన మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే తారక్ అద్భుతంగా మాట్లాడగలరని ప్రత్యర్థి పార్టీలపై అద్భుతంగా విమర్శలు చేయగలరని ఓటర్లు అభిప్రాయపడ్డారు. junior ntr{#}News;Jr NTR;NTR;Industry;TDP;Partyఏపీ : ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటువైపు.. ఆ పార్టీకే ఓటేస్తారా?ఏపీ : ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటువైపు.. ఆ పార్టీకే ఓటేస్తారా?junior ntr{#}News;Jr NTR;NTR;Industry;TDP;PartyThu, 04 Apr 2024 08:07:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయగా ఆ సమయంలో తారక్ ప్రచారం చేసిన మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే తారక్ అద్భుతంగా మాట్లాడగలరని ప్రత్యర్థి పార్టీలపై అద్భుతంగా విమర్శలు చేయగలరని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
 
జూనియర్ ఎన్టీఆర్ సరైన టైమ్ చూసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతుండగా 2030 తర్వాత తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ పార్టీకి ఓటేస్తారనే ప్రశ్నకు మాత్రం టీడీపీ పేరు సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం.
 
తారక్ టీడీపీకి దూరంగా ఉన్నా 2014 ఎన్నికలకు ముందు ఒక సందర్భంలో తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య కొంత గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ తాత్కాలికమేనని నారా, నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీడీపీకి కష్టం వస్తే సహాయం చేసే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారని అందువల్ల ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ ఓటు మాత్రం తెలుగుదేశంకే అని సమాచారం అందుతోంది.
 
ఎన్టీఆర్ ను కేవలం సినిమాల పరంగా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఏ పార్టీకి ఓటేస్తారో కచ్చితంగా చెప్పలేము. ఏపీలో ఎన్నికలకు 39 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా తారక్ వీడియో బైట్ వదులుతారేమో చూడాలి. ఏ రాష్ట్రంలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేసే టాలెంట్ తారక్ సొంతమని ఆయన చెప్పిన జోస్యం ఇప్పటివరకు రాంగ్ కాలేదని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్2 సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>