Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali3266d07c-3a26-4621-9c94-59bd93f57658-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali3266d07c-3a26-4621-9c94-59bd93f57658-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు అటు సోషల్ మీడియాలో కాస్త క్రేజీ ఎక్కువగానే ఉంటుంది. అందుకని హీరో హీరోయిన్లకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల పెళ్లి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇలాంటి వార్తలతో కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బంది పడితే.. ఇంకొందమంది మాత్రం ఇక లైట్ తీసుకుంటూ పట్టించుకోకుండా కెరియర్ పై దృష్టి సారిస్తూ ఉంటారు అని చెప్పాలీ. అదే సమయంలో ఎవరైనా హీరోయిన్ కు సీనియర్ హీరోయిన్ అనే ముద్Anjali{#}anjali;marriage;geetanjali;Hero;Heroine;News;Cinemaనాకు 4 సార్లు పెళ్లయింది.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్?నాకు 4 సార్లు పెళ్లయింది.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్?Anjali{#}anjali;marriage;geetanjali;Hero;Heroine;News;CinemaThu, 04 Apr 2024 09:21:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు అటు సోషల్ మీడియాలో కాస్త క్రేజీ ఎక్కువగానే ఉంటుంది. అందుకని హీరో హీరోయిన్లకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల పెళ్లి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.  ఇలాంటి వార్తలతో కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బంది పడితే.. ఇంకొందమంది మాత్రం ఇక లైట్ తీసుకుంటూ పట్టించుకోకుండా కెరియర్ పై దృష్టి సారిస్తూ ఉంటారు అని చెప్పాలీ.


అదే సమయంలో ఎవరైనా హీరోయిన్ కు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడింది అంటే చాలు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు అంజలికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా కొనసాగుతోంది అంజలి. అయితే ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ కెరియర్లో బిజీ బిజీగానే ఉంది. అయితే అంజలి ప్రధాన పాత్రలో  లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన గీతాంజలి మూవీ సూపర్ హిట్ అవ్వగా.. ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



 గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఇక ఇటీవల అంజలి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు వింత ప్రశ్న ఎదురయింది. పెళ్లి గురించి ప్రశ్న ఎదురుగా.. తనకి ఇప్పటికే నాలుగు సార్లు పెళ్ళి అయింది అంటూ చెప్పుకొచ్చింది. ఏకంగా నాకు తెలియకుండా నాలుగు సార్లు పెళ్లి చేశారు ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. నేను వివాహం చేసుకొని వేరే ఇంట్లో ఉంటున్నట్లు కూడా వార్తలు రాశారు. ఇలాంటి వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. నేను పెళ్లి చేసుకుంటా.. కానీ కొంత సమయం పడుతుంది అంటూ హీరోయిన్ అంజలి చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>