PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila4f968641-af89-417a-8e04-b3bec516f245-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila4f968641-af89-417a-8e04-b3bec516f245-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కడప నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయబోతుంది. ఇక ఈమె ఏప్రిల్ 5వ తేదీన కడప జిల్లా నుండి బస్సు యాత్రను మొదలుపెట్టబోతుంది. కడప జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ కవర్ చేస్తూ ఈ యాత్ర ఉండేవిధంగా ఈ పార్టీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. బస్సు యాత్ర 5 వ తేదీన బద్వేల్ నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో ప్రారంభం కానున్న ఈ బస్సు యాత్ర ప్రొద్దుటూYs sharmila{#}dr rajasekhar;kadapa;Scheduled caste;Proddatur;Vempalli;Yatra;Mydukur;Duvvuru;Badvel;bus;Pulivendula;Andhra Pradesh;Sharmila;Partyరాయలసీమ : షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..!రాయలసీమ : షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..!Ys sharmila{#}dr rajasekhar;kadapa;Scheduled caste;Proddatur;Vempalli;Yatra;Mydukur;Duvvuru;Badvel;bus;Pulivendula;Andhra Pradesh;Sharmila;PartyThu, 04 Apr 2024 14:46:00 GMTమరికొన్ని రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కడప నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయబోతుంది. ఇక ఈమె ఏప్రిల్ 5వ తేదీన కడప జిల్లా నుండి బస్సు యాత్రను మొదలుపెట్టబోతుంది. కడప జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ కవర్ చేస్తూ ఈ యాత్ర ఉండేవిధంగా ఈ పార్టీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. బస్సు యాత్ర 5 వ తేదీన బద్వేల్ నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.

బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో ప్రారంభం కానున్న ఈ బస్సు యాత్ర ప్రొద్దుటూరులో పూర్తి కానుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మొత్తం 8 రోజుల పాటు ఈ బస్సు యాత్ర సాగనుంది. మొదటిరోజు ఈ యాత్ర కలసపాడు , పోరుమామిళ్ల , కోడూరు , గోపవరం మండలాలలో ఉంటుంది. 6 వ తేదీన బద్వేలు , అట్లూరు ప్రాంతాల మీదుగా షర్మిల కడప చేరుకుంటారు. 7 వ తేదీన దువ్వూరు , చాపాడు , కాజీపేట ఎస్ , మైదుకూరు , బ్రహ్మంగారిమఠం మీది గుండా షర్మిల యాత్ర సాగుతుంది.

8 వ తేదీన కమలాపురం , వల్లూరు , చెన్నూరు , చింతకొమ్మదిన్నె , పెండ్లిమర్రి , వీరపునాయునిపల్లి మండలాలలో... 10వ తేదీన పులివెందుల నియోజకవర్గం లోని చక్రాయపేట , వేంపల్లి , వేముల పులివెందుల , లింగాల , సింహాద్రిపురం మండలాలలో ఈ యాత్ర ఉండనుంది. ఇక  ఏఫ్రిల్ 11 వ తేదీన తొండూరు , ఎర్రగుంట్ల , కొండాపురం , ముద్దనూరు , మైలవరంలలో... ఏప్రిల్ 12వ తేదీ జమ్మలమడుగులో ప్రారంభమై పెద్దముడియం మీది గుండా ప్రొద్దుటూరు చేరుకుని రాజుపాలెంలో బస్సు యాత్రను షర్మిల పూర్తి చేయనుంది. ఇలా ఎనిమిది రోజులపాటు షర్మిల కడప జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలను కవర్ చేస్తూ అన్ని ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల కష్టసుఖాలను ఈ బస్సు యాత్ర ద్వారా తెలుసుకోబోతున్నట్లు తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>