PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fan2e34ddd2-7dc2-4c66-bdb2-c9b8367af951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fan2e34ddd2-7dc2-4c66-bdb2-c9b8367af951-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అధికారమే అంతిమ లక్ష్యంగా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు చేసేశాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్య, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయడం విశేషం. ఇటువంటి తరుణంలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ ఆల్మోస్టFAN{#}Maha;zero;Kollu Ravindra;tuesday;Rajya Sabha;MP;Congress;Reddy;Janasena;Bharatiya Janata Party;TDP;Party;Andhra Pradeshఏపీ: రాజ్యసభలో వైఎస్సార్‌సీపీదే హవా... టీడీపీ జీరో అనిపించుకుంది?ఏపీ: రాజ్యసభలో వైఎస్సార్‌సీపీదే హవా... టీడీపీ జీరో అనిపించుకుంది?FAN{#}Maha;zero;Kollu Ravindra;tuesday;Rajya Sabha;MP;Congress;Reddy;Janasena;Bharatiya Janata Party;TDP;Party;Andhra PradeshWed, 03 Apr 2024 14:00:00 GMTఏపీలో ఎన్నికల మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అధికారమే అంతిమ లక్ష్యంగా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు చేసేశాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్య, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయడం విశేషం. ఇటువంటి తరుణంలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ ఆల్మోస్ట్ గల్లంతవడం ఆ పార్టీకి ఒక విధంగా తీరని నష్టం అనే చెప్పుకోవచ్చు.

విషయం ఏమిటంటే, నిన్న అనగా మంగళవారం నాడు టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీ కాలం ముగిసింది. దీంతో, రాజ్యసభలో టీడీపీ మొత్తంగా జీరో అయ్యింది. కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ జీరో కావడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మరో సరి కొత్త చరిత్రకి నాంది పలకడం కొసమెరుపు. అవును, రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌సీపీ అవతరించి, అందరికీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే కావడం గమనార్హం. అయితే ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిన కధే.

ఈ క్రమంలోనే రాజ్యసభ సీట్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుందనే చెప్పుకోవచ్చు. సరిగా ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మైనస్ కాగా అధికార పార్టీ అయినటువంటి వైస్సార్సీపీకి చాలా ప్లస్ కానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు  వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>