PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool9d63c75f-b88a-4d3e-8e06-bd474a4ad475-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool9d63c75f-b88a-4d3e-8e06-bd474a4ad475-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా అసెంబ్లీ స్థానానికి సంబంధించి తెలుగుదేశం నుంచి టీజీ భరత్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే ఆలోచనతో టీజీ భరత్ సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలను అమలు చేస్తానని చెప్పారు. కర్నూలు స్మార్ట్ సిటీ అని అంటారని కర్నూలును చూస్తే అలా అనిపిస్తుందా అని భరత్ ప్రశ్నించారు. kurnool{#}High court;Yevaru;bharath;Sri Bharath;Telugu Desam Party;job;District;CBN;Kurnool;YCPకర్నూలు : టీజీ భరత్ ఇంతియాజ్ మధ్య టఫ్ ఫైట్.. జిల్లాలో గెలుపు ఆ పార్టీదేనా?కర్నూలు : టీజీ భరత్ ఇంతియాజ్ మధ్య టఫ్ ఫైట్.. జిల్లాలో గెలుపు ఆ పార్టీదేనా?kurnool{#}High court;Yevaru;bharath;Sri Bharath;Telugu Desam Party;job;District;CBN;Kurnool;YCPWed, 03 Apr 2024 21:01:00 GMTకర్నూలు జిల్లా అసెంబ్లీ స్థానానికి సంబంధించి తెలుగుదేశం నుంచి టీజీ భరత్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే ఆలోచనతో టీజీ భరత్ సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలను అమలు చేస్తానని చెప్పారు. కర్నూలు స్మార్ట్ సిటీ అని అంటారని కర్నూలును చూస్తే అలా అనిపిస్తుందా అని భరత్ ప్రశ్నించారు.
 
ఈరోజు కూడా కర్నూలులో దోమల సమస్య చెబుతున్నారని ఆయన తెలిపారు. డ్రైనేజ్ సిస్టమ్ ఘోరాదిఘోరంగా ఉందని 2029లోగా కర్నూలును సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తానని భరత్ తెలిపారు. డైలీ 5 నుంచి 10 మంది నన్ను జాబ్ అడుగుతారని నేను కొత్త పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేశానని ఆయన వెల్లడించారు. అనంతపూర్ కియా రూపరేఖలు ఎలా మార్చేసిందో అలా కర్నూలు రూపురేఖలు మార్చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
 
కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేస్తామని చెబుతూ భరత్ మరికొన్ని హామీలు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. కర్నూలులో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం ఇంతియాజ్ కు ప్లస్ అని చెప్పవచ్చు. కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, ఇంతియాజ్ మధ్య పోటాపోటీ ఉండనుందని తెలుస్తోంది. ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేమని స్థానికులు చెబుతున్నారు.
 
కర్నూలులో గెలుపు కోసం ఇంతియాజ్ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారని తెలుస్తోంది. కర్నూలు అభివృద్ధే లక్ష్యమని ఇరు పార్టీల నేతలు చెబుతుండగా ఓటర్ల మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. కర్నూలులో గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం మాత్రం వాస్తవమేనని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. సొంత మేనిఫెస్టో ప్రకటించడం టీజీ భరత్ కు ఒకింత మేలు చేస్తుందని కర్నూలు ఓటర్లు చెబుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>