Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd3091843-2549-4855-837c-be45ef06f571-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd3091843-2549-4855-837c-be45ef06f571-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.. ఎన్నికల హడావుడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా విజయం కోసం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు రాజకీయం మరింత వేడెక్కింది..కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.. ఓ వైపు ప్రచారం చేస్తూనే ప్రత్యర్థి పార్టీ వ్యూహలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.. రాష్ట్రంలో ని అన్నీ నియోజ#assembly elections{#}Gudur;Muralidhar Rao;Nellore;sunil;local language;MLA;politics;Elections;Janasena;YCP;TDP;Partyపాశం సునీల్ కుమార్ vs మేరిగ మురళి .. గూడూరు లో గెలిచేది ఎవరు..?పాశం సునీల్ కుమార్ vs మేరిగ మురళి .. గూడూరు లో గెలిచేది ఎవరు..?#assembly elections{#}Gudur;Muralidhar Rao;Nellore;sunil;local language;MLA;politics;Elections;Janasena;YCP;TDP;PartyWed, 03 Apr 2024 13:24:00 GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.. ఎన్నికల హడావుడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా విజయం కోసం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు రాజకీయం మరింత వేడెక్కింది..కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.. ఓ వైపు ప్రచారం చేస్తూనే ప్రత్యర్థి పార్టీ వ్యూహలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.. 

రాష్ట్రంలో ని అన్నీ నియోజకవర్గాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ తీరే వేరుగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రతి ఎన్నికలలో ఊహించని తీర్పును ఇస్తారు. దాదాపు నేతల పరిస్థితి కూడా అలానే ఉంటుంది..అధికార పక్ష నేతలను స్థానిక నేతలు పరిస్పరం విమర్శించడం మాములే.. స్థానిక నేతలు పరస్పరంగా విమర్శించుకున్న ధాఖలాలు చాలా తక్కువే..అయితే ఈ సారి సీన్ రివర్స్ అయింది అధికార, విపక్ష పార్టీల విమర్శలు ఘాటెక్కాయి.. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల పదునైన వ్యాఖ్యలతో విమర్శించుకుంటున్నారు..దీనితో గూడూరు రాజకీయం హీటెక్కింది.. 

ఎన్నడూ చూడని విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతుందటంతో ఓటర్లు ఏవైపు మొగ్గు చూపుతారో ఆసక్తికరంగా మారింది.. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పోటీలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్డిగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ బరిలో వున్నారు.. పాశం సునీల్ కుమార్ కు ప్రత్యక్ష ఎన్నికలు ఇది మూడో సారి.. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రత్యక్ష ఎన్నికలలో మొదటిసారి పాల్గొంటున్నారు…అయినా ఇరువురు అభ్యర్థులు పట్టు నిలుపుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. పక్కా వ్యూహంతో నాయకులను, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. తగ్గేదే లే అని ఇరు పార్టీ అభ్యర్థులు తలపడుతున్నారు.తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తామో వివరిస్తూ ఊహించని హామీలతో ఇరు పార్టీలు ప్రచారంలో దూకుపోతున్నాయి..అయితే గూడూరులో విజయం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.. మరి ఈ సారి విజయం ఎవరికీ వరిస్తుందో చూడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>