PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-a-storm-in-a-glass-jana-sena-drowning-in-kanchukota6f9848fb-ac28-4ee4-86a9-d1d789590b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-a-storm-in-a-glass-jana-sena-drowning-in-kanchukota6f9848fb-ac28-4ee4-86a9-d1d789590b0a-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో చాలామంది కీలక నేతలకు సీట్లు దక్క‌ని పరిస్థితి. పార్టీ కోసం గత నాలుగేళ్లుగా ఎంతో కష్టపడుతూ కోట్లాది రూపాయల ఖర్చు చేశామని.. ఇప్పుడు పూచిక‌ పుల్లలా తీసి పక్కన పెట్టేసారని.. చాలామంది కీలక నేతలు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఇదే అసంతృప్తి.. జనసేన క్యాడర్‌లో ఉంది. గాజుగ్లాసులో మొదలైన ఈ అలజడి.. పార్టీకి కంచుకోటగా ఉన్న విశాఖ జిల్లాలో పార్టీని నిలువునా ముంచేస్తుందా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. భీమిలి సీటును జనసేన నAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jenasena; pawan kalyan{#}sathish;Anakapalle;Bheemili;Gajuwaka;Vishakapatnam;CBN;Janasena;Partyవిశాఖ‌: గ్లాసులో తుఫాన్‌... కంచుకోట‌లో జ‌న‌సేన మునిగే నావేనా..!విశాఖ‌: గ్లాసులో తుఫాన్‌... కంచుకోట‌లో జ‌న‌సేన మునిగే నావేనా..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jenasena; pawan kalyan{#}sathish;Anakapalle;Bheemili;Gajuwaka;Vishakapatnam;CBN;Janasena;PartyWed, 03 Apr 2024 10:55:23 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో చాలామంది కీలక నేతలకు సీట్లు దక్క‌ని పరిస్థితి. పార్టీ కోసం గత నాలుగేళ్లుగా ఎంతో కష్టపడుతూ కోట్లాది రూపాయల ఖర్చు చేశామని.. ఇప్పుడు పూచిక‌ పుల్లలా తీసి పక్కన పెట్టేసారని.. చాలామంది కీలక నేతలు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఇదే అసంతృప్తి.. జనసేన క్యాడర్‌లో ఉంది. గాజుగ్లాసులో మొదలైన ఈ అలజడి.. పార్టీకి కంచుకోటగా ఉన్న విశాఖ జిల్లాలో పార్టీని నిలువునా ముంచేస్తుందా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.


భీమిలి సీటును జనసేన నేతలు ఆశించారు. దానిని పొత్తులో టీడీపీకి ఇవ్వ‌డంతో చంద్రబాబు ఆ సీటు గంటాకు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడని జనసేన నేతలు వాపోతున్నారు. భీమిలి సీటు పంచకర్ల సందీప్‌కు ఇస్తానని పవన్ మాట ఇచ్చి.. చివర్లో మాట తప్పడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ‌ దక్షిణ నియోజకవర్గంలో టిక్కెట్టు ఇస్తామన్న హామీతో గ్లాసు పట్టుకున్న కార్పొరేటర్లు.. కందుల నాగరాజు, సాధిక్.. పవన్ ను నమ్ముకుని రోడ్డున పడ్డామని వాపోతున్నారు.


ఉత్తర నియోజకవర్గం లో పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడుతున్న‌ పసుపులేటి ఉషాకిరణ్‌కి పవన్ హ్యాండ్ ఇచ్చేశారు. గాజువాక టిక్కెట్ ఆశించి కోట్లు ఖర్చుపెట్టిన సుందరపు సతీష్ ని కూడా కరివేపాల పక్కన పడేశారు. అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు గత ఎన్నికలలో పోటీచేసి పార్టీ కోసం కష్టపడుతూ వస్తుంటే ఆయనను కాదని అలా కండువా కప్పుకున్నారో లేదో వెంటనే కొణతాల రామకృష్ణకు సీటు ఇచ్చేశారు. పాయకరావుపేటలో జనసేన నేత గడ్డం బుజ్జి సీటు ఆశిస్తే ఇవ్వలేదు.


చివరకు వంగలపూడి అనితకు సీటు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేసినా పవన్ పట్టించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలలోను జనసేనలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన సొంతంగా పోటీ చేసినా గట్టి ప్రభావం చూపేది. పొత్తులో భాగంగా కనీసం పవన్ ఏడు, ఎనిమిది సీట్లు అడుగుతారని అనుకుంటే.. నాలుగు సీట్లు తీసుకున్నారు. అనకాపల్లి పార్లమెంటు సీటు తీసుకుని మరి బీజేపికి కట్టబెట్టారు. దీంతో జిల్లాలో జనసేన కేడర్ పవన్ తీరుపై రగిలిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>