SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/kavitha78fc7b19-367e-4040-9623-2406bce549e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/kavitha78fc7b19-367e-4040-9623-2406bce549e5-415x250-IndiaHerald.jpgకేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దైనందిన జీవితంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి దిల్లీలోని తీహాడ్ జైలులో ఉంటున్న కవిత తనకు జపమాల, చదువుకోవడానికి ఆధ్మాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతిని కోరారు. అలాగే చదువుకోవడానికి ఇతరత్రా పుస్తకాలను అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. కవిత అడిగిన వస్తువులు ఇవ్వాలని తీహాడ్ జైలు అధికారులను రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే.. మామూలుగా రాజకీయ నాయకులు తీరిక లేని సkavitha{#}kavitha;court;CM;Manam;Partyతీహార్‌ ఎఫెక్ట్‌: జైలుకు వెళ్లగానే కవితలో అంత మార్పా?తీహార్‌ ఎఫెక్ట్‌: జైలుకు వెళ్లగానే కవితలో అంత మార్పా?kavitha{#}kavitha;court;CM;Manam;PartyWed, 03 Apr 2024 09:59:03 GMTకేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దైనందిన జీవితంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి దిల్లీలోని తీహాడ్ జైలులో ఉంటున్న కవిత తనకు జపమాల, చదువుకోవడానికి ఆధ్మాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతిని కోరారు. అలాగే చదువుకోవడానికి ఇతరత్రా పుస్తకాలను అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. కవిత అడిగిన వస్తువులు ఇవ్వాలని తీహాడ్ జైలు అధికారులను రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది.


ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే.. మామూలుగా రాజకీయ నాయకులు తీరిక లేని సమయాన్ని గడుపుతుంటారు. వీరికి 24 గంటలు సరిపోవన్నట్లుగా వారి షెడ్యూల్ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు జనాలే జనాలు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టింది మొదలు. ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా ప్రజలతోనే మమేకం అవుతుంటారు. దీనికి కవిత కూడా మినహాయింపు ఏమీ కాదు. అందులో మాజీ సీఎం కుమార్తె. అందుకే ఊపిరి తీసుకోలేని బిజీగా ఉంటుంటారు.


ఎలాగూ పార్టీ మీటింగ్ లు, నియోజకవర్గంలో పర్యటనలు, సభలు, నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఉండవు. దీంతో తనకు జైలులో దొరికిన సమాయన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కవిత అనుకుంటున్లట్టు అర్థం అవుతోంది. మనిషికి రెండు రకాలుగా విశ్రాంతి అవసరం. మొదటిది శారీరకంగా.. రెండోది మానసికంగా. శారీరక విశ్రాంతి అంటే నిద్ర సరిపోతుంది. మానసిక విశ్రాంతికి యోగా, మెటిటేషన్, జపం వంటివి చేస్తుంటారు. అందుకే కవిత కూడా జైలులో ఉన్నంత కాలం అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నారు.


మొత్తానికి జైలుకి వెళ్లిన వారిలో మార్పు వస్తుందంటారు. ఈ విషయం కవితను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు జపం, మెడిటేషన్ చేశారో లేదో తెలియదు కానీ.. తీహార్‌ జైలులో మాత్రం మెడిటేషన్ మొదలు పెట్టేశారు. జైలులో కావాల్సినంత సమయం దొరకుతుంది. పైగా మెడిటేషన్, జపం మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పైగా శరీరం, మనసుకు ఏకకాలంలో ఉపశమనం కలిగిస్తుంది. అందుకే కవిత ఆధ్యాత్మిక పుస్తకాలు, జపమాల తో జైలు జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>