PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-aa-samasyanu-munde-uhinchadadbae864a-76eb-4927-838b-014d2017d6f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-aa-samasyanu-munde-uhinchadadbae864a-76eb-4927-838b-014d2017d6f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడేకొద్ది విస్తృతంగా ప్రచారం చేసే పనిలో పడిపోయారు అధికార పార్టీ వైసీపీ అలాగే ప్రతిపక్షపార్టీ టీడీపీ. ప్రచారంలో భాగంగానే గురజాల నియోజకవర్గంలోని మాచవరంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని జిల్లాలో కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజల సాగు,తాగు నీటి కష్టాలు తీరుతాయని అన్నారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడానికి కారణం కృష్ణానదికి వరదలు వస్తే దిగువకు నీరు వస్తుందని అలాంటి సమస్యను ముందుగానassembly elections{#}Lavu Sri Krishna Devarayalu;Yerapathineni Srinivasa Rao;narasaraopet;KASU MAHESH REDDY;Gurazala;Aqua;Industries;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;MP;MLA;Party;CBN;TDP;YCPపల్నాడు : చంద్రబాబు ఆ సమస్యను ముందే ఊహించాడా....??పల్నాడు : చంద్రబాబు ఆ సమస్యను ముందే ఊహించాడా....??assembly elections{#}Lavu Sri Krishna Devarayalu;Yerapathineni Srinivasa Rao;narasaraopet;KASU MAHESH REDDY;Gurazala;Aqua;Industries;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;MP;MLA;Party;CBN;TDP;YCPWed, 03 Apr 2024 20:13:03 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడేకొద్ది విస్తృతంగా ప్రచారం చేసే పనిలో పడిపోయారు అధికార పార్టీ వైసీపీ అలాగే ప్రతిపక్షపార్టీ టీడీపీ. ప్రచారంలో భాగంగానే గురజాల నియోజకవర్గంలోని మాచవరంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని జిల్లాలో కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజల సాగు,తాగు నీటి కష్టాలు తీరుతాయని అన్నారు.

చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడానికి కారణం కృష్ణానదికి వరదలు వస్తే దిగువకు నీరు వస్తుందని అలాంటి సమస్యను ముందుగానే గుర్తించి గురజాల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి సాగునీరు అందించేందుకు కృషి చేసింది చంద్రబాబు అని గుర్తుచేశారు. అలాగే ప్రస్తుతం మాచర్లతో పాటు చిలకలూరిపేటలో కూడా తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.కూటమి పార్టీ అధికారంలోకి రాగానే పల్నాడు ప్రాంత యువతకు మంచి ఉపాధి అవకాశాలు తెచ్చి పెట్టె పరిశ్రమలు తీసుకొస్తామని లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. అయితే వైసీపీ తాను చేస్తున్న ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీతో కలిస్తే మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మైనార్టీలతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం చెప్పిన మాటకి కట్టుబడి ఉందన్నారు.

గురజాల నియోజకవర్గం నుండి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అలాగే వైసీపీ నుండి కాసు మహేష్ రెడ్డి పోరుకి సిద్దంగా ఉన్నారు. యరపతినేని మాట్లాడుతూ ఇటీవల వైసీపీ చేసిన వ్యాఖ్యలు గుర్తుచేశారు.''20 ఏళ్లు కచ్చితంగా వైసీపీ అధికారంలో ఉంటుంది,తెదేపా పార్టీను కనుమరుగు అయ్యేలా చేస్తామని ఈ అయిదేళ్లలోనే వైసీపీ అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు”.ఇక్కడ కాసు మహేశ్‌రెడ్డి చేస్తున్న అరాచకాలకు పోలీసులను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తు గా ఓడించడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>