Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakd1897ca4-3515-46b1-aa3e-c3bffcbbd03e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakd1897ca4-3515-46b1-aa3e-c3bffcbbd03e-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా పాకిస్తాన్ జట్టు అన్ని ఫార్మాట్లలో కూడా ఘోరంగా విఫలమవుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. అదే సమయంలో ఇక ఆ జట్టుకు కెప్టెన్లుగా ఉన్న ఆటగాళ్లు కూడా తరచూ మారుతూనే ఉన్నారు. కేవలం కెప్టెన్లు మాత్రమేనా కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి ఇక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వారికి కూడా ఇలా మార్పులు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఇలాంటి మార్పుల మధ్య పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. అPak{#}Cricket;Pakistan;Armyపాక్ ఆటగాళ్లకు.. ఆర్మీ శిక్షణ షురూ.. వీడియో వైరల్?పాక్ ఆటగాళ్లకు.. ఆర్మీ శిక్షణ షురూ.. వీడియో వైరల్?Pak{#}Cricket;Pakistan;ArmyWed, 03 Apr 2024 08:05:00 GMTగత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా పాకిస్తాన్ జట్టు అన్ని ఫార్మాట్లలో కూడా ఘోరంగా విఫలమవుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. అదే సమయంలో ఇక ఆ జట్టుకు కెప్టెన్లుగా ఉన్న ఆటగాళ్లు కూడా తరచూ మారుతూనే ఉన్నారు. కేవలం కెప్టెన్లు మాత్రమేనా కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి ఇక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వారికి కూడా ఇలా మార్పులు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఇలాంటి మార్పుల మధ్య పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది.



 అయితే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్నెస్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ లేని ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోవడం కారణంగానే ఇక ఐసిసి టోర్నీలలో అటు పాకిస్తాన్ పెద్దగా రాణించలేక పోతుంది అంటూ విమర్శలు చేశారు. గతంలో లాగా ప్రస్తుతం ఐసీసీ ఆటగాళ్ల ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై దృష్టి సారించింది అన్నది తెలుస్తుంది. ఏకంగా పాకిస్తాన్ క్రికెటర్లకు సైన్యంలోని జవాన్లకు ఇచ్చినట్లుగానే శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది.



 ఏకంగా కొంతమంది సైనికులతో పాకిస్తాన్ క్రికెటర్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలా చేయడం వల్ల పాక క్రికెటర్ల ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. అయితే గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించింది పిసిబి. ఇక ఇటీవల ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. కాకుల్ లోని ఆర్మీ స్కూల్లో గత కొన్ని రోజులుగా క్రికెటర్లు శిక్షణలో పాల్గొంటున్నారు. వారు సైనికుల తరహా లోనే ఇలా వ్యాయామాలు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే సైనికుల తరహాలోనే ఆటగాళ్లు కూడా ఫిట్నెస్  సాధించేలా ఇలాంటి ప్లాన్ వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>