PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024789ea57d-c251-4400-90b1-4dcd2879c7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024789ea57d-c251-4400-90b1-4dcd2879c7e6-415x250-IndiaHerald.jpgవిజయనగరం వంశీకుడు టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు తరువాత అగ్ర అధినేతగా పేరు తెచ్చుకున్న పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజుని ముందుకు తెచ్చారు. ఆమెకు 2019 వ సంవత్సరంలో టికెట్ ఇప్పించుకుంటే జగన్ సునామిలో ఓటమి పాలు అయ్యారు. ఈ 2024 వ సంవత్సరంలో కూడా ఆమెకే టికెట్ దక్కించుకునేలా పావులు కదిపారు.అందువల్ల మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం రగిలిపోతోంది. ఎందుకంటే ఆమె తనకు టికెట్ దక్కుతుందని ఎంతగానో ఆశించారు. 2014 వ సంవత్సరంలో ఆమె ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసAP Elections 2024{#}ashok;Vijayanagaram;Vizianagaram;geetha;raja;king;East;war;central government;Jagan;MLA;Hanu Raghavapudi;Party;Telugu Desam Party;TDP;CBNఉత్తరాంధ్ర: అగ్ర నేత కూతురుకి ఆ అభ్యర్థితో పోటీ.. కష్టమే?ఉత్తరాంధ్ర: అగ్ర నేత కూతురుకి ఆ అభ్యర్థితో పోటీ.. కష్టమే?AP Elections 2024{#}ashok;Vijayanagaram;Vizianagaram;geetha;raja;king;East;war;central government;Jagan;MLA;Hanu Raghavapudi;Party;Telugu Desam Party;TDP;CBNWed, 03 Apr 2024 11:40:48 GMTవిజయనగరం వంశీకుడు టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు తరువాత అగ్ర అధినేతగా పేరు తెచ్చుకున్న పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజుని ముందుకు తెచ్చారు. ఆమెకు 2019 వ సంవత్సరంలో టికెట్ ఇప్పించుకుంటే జగన్ సునామిలో ఓటమి పాలు అయ్యారు. ఈ 2024 వ సంవత్సరంలో కూడా ఆమెకే టికెట్ దక్కించుకునేలా పావులు కదిపారు.అందువల్ల మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం రగిలిపోతోంది. ఎందుకంటే ఆమె తనకు టికెట్ దక్కుతుందని ఎంతగానో ఆశించారు. 2014 వ సంవత్సరంలో ఆమె ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు అప్పుడు కేంద్ర మంత్రిగా విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్ గజపతి రాజు నుంచి సహాయ నిరాకరణ జరిగిందని అంటారు.గీతను అప్పుడు ఒక ఎమ్మెల్యేగా పని చేయనీయకుండా అశోక్ వర్గీయులు చేశారని ఆమె అధికారాలను కట్ చేసి నియంత్రించారని అంటారు. ఒక దశలో అశోక్ గజపతి రాజు వర్సెస్ గీతగా విజయనగరం తెలుగు దేశం పార్టీలో పొలిటికల్ వార్ నడిచింది.


 దాంతో 2019 వ సంవత్సరంలో గీతకు టికెట్ దక్కలేదు. 2024 వ సంవత్సరంలో గీతకే టికెట్ అని టీడీపీ హై కమాండ్ చెప్పి తీరా సరైన సమయానికి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అశోక్ గజపతి రాజు ఒత్తిడితో ఇదంతా జరిగిందని మీసాల గీత వర్గం మండిపడుతోంది.తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వకపోవడంతో మీసాల గీత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు విజయనగరంలో తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాను అని భావిస్తున్నారు.అయితే ఆమె పోటీ చెయ్యడం వల్ల అశోక్ కూతురు అదితి విజయావకాశాలు బాగా తగ్గిపోతాయని అంటున్నారు.తూర్పు కాపులు బీసీలు గీతకు అండగా నిలబడితే ఈ పోరులో వైసీపీకే చాన్స్ ఉంటుందని అంటున్నారు. గీత పోటీ అనివార్యం అయిన నేపధ్యంలో ఆమెను పోటీకి దూరంగా ఉంచేందుకు తెలుగు దేశం పార్టీ పెద్దలు ఏమి చేస్తారో తెలియదు. తన పొలిటికల్ కోసం గీత వేస్తున్న ఈ అడుగులు రాజా వారి మూడవ తరం రాజకీయ గీతనే మారుస్తాయని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>