Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-521d9b3e-ecbc-4271-87be-9ad0406de988-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-521d9b3e-ecbc-4271-87be-9ad0406de988-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో జనాలు కొన్ని కొన్ని విషయాల్లో చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఏప్రిల్ నెల వచ్చింది అంటే చాలు ఇక ఫూల్స్ నెల అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్నేహితులు ఏదో ఒక రీతిలో తమ స్నేహితులను ఏప్రిల్ పూల్స్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా ఏప్రిల్ ఫూల్స్ చేయడానికిSuicide {#}Sucide;Manam;Uri;Madhya Pradesh - Bhopal;policeఏప్రిల్ ఫూల్ చేద్దామని డ్రామా.. చివరికి ప్రాణం పోయింది?ఏప్రిల్ ఫూల్ చేద్దామని డ్రామా.. చివరికి ప్రాణం పోయింది?Suicide {#}Sucide;Manam;Uri;Madhya Pradesh - Bhopal;policeWed, 03 Apr 2024 11:00:00 GMTఇటీవల కాలంలో జనాలు కొన్ని కొన్ని విషయాల్లో చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా అనూహ్యంగా  ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఏప్రిల్ నెల వచ్చింది అంటే చాలు ఇక ఫూల్స్ నెల అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్నేహితులు ఏదో ఒక రీతిలో తమ స్నేహితులను ఏప్రిల్ పూల్స్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా ఏప్రిల్ ఫూల్స్  చేయడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా ఏకంగా స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని ఇక కొంతమంది చేసే పనులు కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక నాటకానికి తెర లేపాడు. కానీ చివరికి ఈ నాటకంలో అతనే ఓడిపోయి.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్యమైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకోవాలి అనుకున్న ఎంతో మంది.. ఏకంగా వీడియో కాల్ చేస్తూ ఇలా సూసైడ్ చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.



 అయితే తాను కూడా ఇలా ఉరి వేసుకుంటున్నట్లు.. నాటకమాడి ఏకంగా స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేయాలని అనుకున్నాడు ఓ విద్యార్థి. ఇక ఉరితాడును మెడకి బిగించుకుని ఆ విద్యార్థి ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఆ వీడియో కాల్ లో స్నేహితునికి తెలిపాడు. ఇద్దరు స్నేహితులు ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో తాను నిలబడి ఉన్న కుర్చీ పడిపోవడంతో ఒక్కసారిగా ఉరి అతని మెడకు బిగుసుకుపోయింది. చివరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో అతను విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>