PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-chandrababu-tdp3521d93b-1af8-41f1-b1d9-e8939b1fc2ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-chandrababu-tdp3521d93b-1af8-41f1-b1d9-e8939b1fc2ad-415x250-IndiaHerald.jpgచంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని.. వచ్చే ఎన్నికలలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిని ఓడించి.. రివెంజ్ తీర్చుకుంటానని.. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ శపథాలు చేస్తున్నారు. 2009 - 2014 ఎన్నికలలో ఉండి నుంచి రెండుసార్లు వరుసగా టీడీపీ తరపున శివ విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుతో పాటు తిరుగులేని పట్టు ఉంది. 2019 ఎన్నికలలో చంద్రబాబు సూచన మేరకు తాను నరసాపురం పార్లమెంట్‌కు తన కజిన్ బ్రదర్ మంతెన రామరాజు ఉండి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నిAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chandrababu; tdp{#}Mithoon;Shiva;ramaraju;MANTENA RAMARAJU;lord siva;Abhimanyu Mithun;narasapuram;Narsapur;CBN;YCP;TDP;MLA;Hanu Raghavapudi;Assemblyగోదావ‌రి: చంద్ర‌బాబు మోసం జీవితాంతం మ‌ర‌వ‌ను.. టీడీపీని ఓడించి క‌సి తీర్చుకుంటా..!గోదావ‌రి: చంద్ర‌బాబు మోసం జీవితాంతం మ‌ర‌వ‌ను.. టీడీపీని ఓడించి క‌సి తీర్చుకుంటా..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chandrababu; tdp{#}Mithoon;Shiva;ramaraju;MANTENA RAMARAJU;lord siva;Abhimanyu Mithun;narasapuram;Narsapur;CBN;YCP;TDP;MLA;Hanu Raghavapudi;AssemblyWed, 03 Apr 2024 11:21:42 GMTచంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని.. వచ్చే ఎన్నికలలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిని ఓడించి.. రివెంజ్ తీర్చుకుంటానని.. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ శపథాలు చేస్తున్నారు. 2009 - 2014 ఎన్నికలలో ఉండి నుంచి రెండుసార్లు వరుసగా టీడీపీ తరపున శివ విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుతో పాటు తిరుగులేని పట్టు ఉంది.


2019 ఎన్నికలలో చంద్రబాబు సూచన మేరకు తాను నరసాపురం పార్లమెంట్‌కు తన కజిన్ బ్రదర్ మంతెన రామరాజు ఉండి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రామరాజు ఉండిలో ఎమ్మెల్యేగా గెలిస్తే శివ నరసాపురం పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికలలో భవిష్యత్తులో తన ఉండి అసెంబ్లీ సీటును తనకే ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తనను పూర్తిగా పక్కన పెట్టి రామరాజుకి ఇచ్చి.. తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇటు తాను సీటు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే రామరాజు సైతం నియోజకవర్గంలో తన వర్గాన్ని, తన అభిమానులను పూర్తిగా రాజకీయంగా అణ‌గదొక్కే ప్రయత్నం చేశారని కూడా వాపోతున్నారు. శివకు.. చంద్రబాబు ఎలాగూ సీటు ఇవ్వకపోవడంతో.. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఎన్నికల్లో ఎలాగైనా ఇండిపెండెంట్గా గెలిచి.. చంద్రబాబుకు తన సత్తా ఏంటో చాటాలని శివ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


లేనిపక్షంలో భారీగా ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు కూడా తాను వెనకాడనని శివ పంతంతో ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. ఇప్ప‌టికే శివ‌ను కూల్ చేసేందుకు ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో.. శివ ఉండిలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే నామినేష‌న్ల ప‌ర్వం స్టార్ట్ అయ్యే టైంకు అయినా శివ‌ను వైసీపీ లోకి తీసుకువెళ్లి సీటు ఇచ్చే ప్ర‌య‌త్నాలు కూడా మిథున్ రెడ్డి మొద‌లు పెట్టార‌ని టాక్ ?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>