MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan-creates-world-record91cfd894-9643-4c05-bf1b-b9b9324ce542-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan-creates-world-record91cfd894-9643-4c05-bf1b-b9b9324ce542-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అన్ని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, స్టార్‌ హీరోల పాత సినిమాలకు సెకండ్‌ పార్ట్‌ లు రావడం అనేది చాలా కామన్‌ అయ్యింది.అయితే ఒక హీరో మాత్రం ఏకంగా 8 సీక్వెల్స్ ను చేయబోతున్నాడు. ఇది వరల్డ్ రికార్డ్ గా ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ ఉన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్ ఇటీవలే రైడ్ 2 సినిమాను మొదలు పెట్టాడు.త్వరలో దేదే ప్యార్ దే సినిమా సీక్వెల్‌ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక 12 ఏళ్ల కిందటAjay Devgan{#}Ajay Devgn;Varsham;netizens;News;Hero;bollywood;Cinema;mediaబాలీవుడ్: వరల్డ్ రికార్డ్ సృష్టించిన అజయ్ దేవగన్?బాలీవుడ్: వరల్డ్ రికార్డ్ సృష్టించిన అజయ్ దేవగన్?Ajay Devgan{#}Ajay Devgn;Varsham;netizens;News;Hero;bollywood;Cinema;mediaWed, 03 Apr 2024 21:32:00 GMTప్రస్తుతం అన్ని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో  సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, స్టార్‌ హీరోల పాత సినిమాలకు సెకండ్‌ పార్ట్‌ లు రావడం అనేది చాలా కామన్‌ అయ్యింది.అయితే ఒక హీరో మాత్రం ఏకంగా 8 సీక్వెల్స్ ను చేయబోతున్నాడు. ఇది వరల్డ్ రికార్డ్ గా ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ ఉన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్ ఇటీవలే రైడ్ 2 సినిమాను మొదలు పెట్టాడు.త్వరలో దేదే ప్యార్ దే సినిమా  సీక్వెల్‌ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక 12 ఏళ్ల కిందట వచ్చిన సన్నాఫ్ సర్దార్‌ సినిమా కి కూడా సీక్వెల్‌ ను చేసే పనిలో మేకర్స్ ఉన్నారని సమాచారం తెలుస్తోంది. ఇంకా అవి కాకుండా దృశ్యం సీక్వెల్‌ కి కూడా అజయ్‌ దేవగన్ రెడీ అవుతున్నాడు. ఢమాల్‌ 4, గోల్‌ మాల్‌ 5 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఇటీవల విడుదల అయిన షైతాన్ కి కూడా సీక్వెల్‌ ను మేకర్స్ ప్రకటించారు.


ఇంకా మరో రెండు మూడు సీక్వెల్స్ కూడా చర్చల దశలో ఉన్నాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. ఇలా ఒక్క హీరో ఇన్ని సీక్వెల్స్ ను చేయడం కచ్చితంగా వరల్డ్‌ రికార్డ్‌ అని మీడియా వర్గాల్లో చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఒకే సారి 8 సీక్వెల్స్ ను కమిట్‌ అయిన హీరో అజయ్ దేవగన్.. ఆయన ఘట్స్ కి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అజయ్ దేవగన్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సందడి చేయడంలో విఫలం అవుతున్నాయి. ఈ 8 సీక్వెల్స్ కచ్చితంగా ఆయనకు హిట్స్‌ తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయనిపిస్తుందని ఆయన ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలకు సీక్వెల్స్ కనుక పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. పైగా ఆ సినిమాలకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అవుతుంది.కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>