PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/i-cant-even-see-chandrababus-facea3d138ef-e985-47d1-9f6f-edc052142140-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/i-cant-even-see-chandrababus-facea3d138ef-e985-47d1-9f6f-edc052142140-415x250-IndiaHerald.jpg2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే వైసీపీ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు టీడీపీకి ప్లస్ కాగా బీజేపీతో పొత్తు టీడీపీకి మైనస్ అయిందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల కూటమికి 15 నుంచి 20 నియోజకవర్గాల్లో భారీ షాక్ తప్పదని సర్వేల ద్వారా వెల్లడవుతోంది. మరోవైపు చంద్రబాబు చేసిన పనితో వైసీపీలో జీరో అయిన వ్యక్తి హీరో అయ్యాడు. chandrababu naidu{#}Ananthapuram;Driver;zero;News;CBN;Hero;MLA;YCP;media;Andhra Pradeshఏపీ : హతవిధీ! జీరోను హీరో చేసిన బాబు..?ఏపీ : హతవిధీ! జీరోను హీరో చేసిన బాబు..?chandrababu naidu{#}Ananthapuram;Driver;zero;News;CBN;Hero;MLA;YCP;media;Andhra PradeshWed, 03 Apr 2024 10:00:00 GMT2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే వైసీపీ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు టీడీపీకి ప్లస్ కాగా బీజేపీతో పొత్తు టీడీపీకి మైనస్ అయిందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల కూటమికి 15 నుంచి 20 నియోజకవర్గాల్లో భారీ షాక్ తప్పదని సర్వేల ద్వారా వెల్లడవుతోంది. మరోవైపు చంద్రబాబు చేసిన పనితో వైసీపీలో జీరో అయిన వ్యక్తి హీరో అయ్యాడు.
 
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. టిప్పర్ లారీ డ్రైవర్ గా పని చేసిన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చిన వైసీపీ మా పార్టీలో సామాన్యులకు సైతం ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పేసింది. అయితే చంద్రబాబు టిప్పర్ లారీ డ్రైవర్ వీరాంజనేయులు పేరును ప్రస్తావిస్తూ ఒకింత నెగిటివ్ గా చేసిన కామెంట్లు వీరాంజనేయులుకు ఎంతో ప్లస్ అయ్యాయి.
 
వాస్తవానికి శింగనమల డివిజన్ లో వీరాంజనేయులుకు అనుకూలంగా పరిస్థితులు లేవు. నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు ఆయనకు సపోర్ట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వీరాంజనేయులు గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చోకూడదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
గతంలో వీరాంజనేయులును పార్టీలో వ్యతిరేకించిన వాళ్లు సైతం ఒక్కటై ఇప్పుడు ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు తనకు చెడు చేయాలని ప్రయత్నించినా
మంచే జరిగిందని వీరాంజనేయులు ఫీలవుతున్నారట. విమర్శలు చేసే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాలని సోషల్ మీడియా యుగంలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తే ఫలితం అనుభవించక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వల్ల వీరాంజనేయులు ఎమ్మెల్యే కావడం ఖాయమని తెలుస్తోంది. శింగనమల రిజర్వ్డ్ స్థానం కావడంతో చంద్రబాబుకు మరింత నష్టం జరిగిందని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో చంద్రబాబు మాట్లాడే మాటల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>