Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaafcd0ac-8b5b-4d9a-b18f-ab045c59daa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaafcd0ac-8b5b-4d9a-b18f-ab045c59daa1-415x250-IndiaHerald.jpgహీరోయిన్‌ అంజలిపై ఇప్పటికే చాలా సార్లు మ్యారేజ్‌ రూమర్లు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్‌ చేయడం విశేషం.హీరోయిన్‌ అంజలి టాలీవుడ్‌లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేసిన మూవీ గీతాంజలి2ః మళ్ళీ వచ్చింది వస్తుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబsocialstars lifestyle{#}geetanjali;anjali;marriage;News;Cinemaఆ విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి...!!ఆ విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి...!!socialstars lifestyle{#}geetanjali;anjali;marriage;News;CinemaWed, 03 Apr 2024 22:20:00 GMTహీరోయిన్‌ అంజలిపై ఇప్పటికే చాలా సార్లు మ్యారేజ్‌ రూమర్లు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్‌ చేయడం విశేషం.హీరోయిన్‌ అంజలి టాలీవుడ్‌లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేసిన మూవీ గీతాంజలి2ః మళ్ళీ వచ్చింది వస్తుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో అంజలి పాల్గొంది. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 ఇందులో అంజలి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆమెపై మ్యారేజ్‌ రూమర్లు వస్తున్నాయి. త్వరలోనే అంజలి మ్యారేజ్‌ చేసుకోబోతుందనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో రిపోర్టర్‌ ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనిపై అంజలి స్పందించింది. రిపోర్టర్‌కి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది.ఇందులో అంజలి చెబుతూ, పెళ్లికి రావాల్సింది నేను, నాకే చెప్పలేదు. ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదో సారి మ్యారేజ్‌ చేయడానికి చూస్తున్నారు. తాను కూడా ఇటీవలే ఆ వార్తలు విన్నాను. పెళ్లి అయితే చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వచ్చిన వార్తలకు నాకు ఏ సంబంధం లేదు.అంజలి ఇంకా చెబుతూ, నేను మరో విషయం విన్నాను, ఎవరితోనో సహజీవనంలో ఉన్నానని, నేనే మా ఇంట్లో ఉండటం లేదు. ఔట్ డోర్‌లో ఉంటున్నాను. ఉంటున్నవాళ్లు ఎవరో నాకు రెంట్‌ ఇచ్చేసి వెళ్లిపోతే బాగుంటుంది, ఈఎంఐలు కట్టుకోవడానిక పనికొస్తుంది అంటూ తనదైన స్టయిల్‌ లో సెటైర్లు పేల్చింది అంజలి. పెళ్లి మ్యాటర్‌ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పింది.

 ఇక సినిమా ఆఫర్లపై చెబుతూ వస్తున్నాయని, కానీ అన్ని చేయడం లేదని, మంచి ఆఫర్లు మాత్రమే చేస్తున్నానని వెల్లడించింది. ప్రస్తుతం గీతాంజలి మళ్లి వస్తుంది సినిమాతో ఈ రెండో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది అంజలి. మరోవైపు `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`లో కీలక పాత్రలో నటిస్తుంది అంజలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>