Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyqoodad8ff713-9057-4f61-925d-0848cd15f7bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyqoodad8ff713-9057-4f61-925d-0848cd15f7bc-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరియర్ మొదట్లో చిన్నాచితక పాత్రలు చేస్తూ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ.. అటు పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేశాడు ఈ హీరో. అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. అటు వెంటనే పరశురాం దర్శకత్వంలోTollyqood{#}kushi;vijay deverakonda;Kushi;Cinema;Arjun Reddy;Blockbuster hit;Press;Hero;Joseph Vijay;Indiaఅది నాకు నేను వేసుకున్న శిక్ష.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్?అది నాకు నేను వేసుకున్న శిక్ష.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్?Tollyqood{#}kushi;vijay deverakonda;Kushi;Cinema;Arjun Reddy;Blockbuster hit;Press;Hero;Joseph Vijay;IndiaWed, 03 Apr 2024 08:15:00 GMTఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరియర్ మొదట్లో చిన్నాచితక పాత్రలు చేస్తూ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ.. అటు పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేశాడు ఈ హీరో. అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.


 అటు వెంటనే పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీతాగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మధ్యలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తీసి బొక్క బోర్లా పడ్డాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ నుంచి కోలుకోవడానికి విజయ్ దేవరకొండకు సైతం కాస్త సమయం పట్టింది. అయితే లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి అనే మూవీ చేశాడు. ఇక ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా మాత్రం పెద్దగా హీట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


 ఈనెల 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన లైగర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైగర్ విడుదలకు ముందు విజయ్ దేవరకొండసినిమా కలెక్షన్స్ గురించి ప్రెస్ మీట్ లలో ఎంతో గొప్పగా చెప్పారు. కానీ రిలీజ్ అయ్యాక మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక ఇదే విషయం పై స్పందించిన విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా చెప్పిన పాఠం తర్వాత ఏ మూవీ గురించి సినిమాకు ముందే మాట్లాడొద్దు అని అనుకున్నాను. ఇది తనకు తాను వేసుకున్న శిక్ష అంటూ రౌడీ హీరో చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>