EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababubcb19b01-da8b-412e-9d03-4bb58c409ad5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababubcb19b01-da8b-412e-9d03-4bb58c409ad5-415x250-IndiaHerald.jpgజడ శ్రవణ్ కుమార్.. ఈ పేరు తెలియని వారు ఏపీలో ఉండరు. తెలుగుదేశం పార్టీ అనుకూల న్యాయవాది. జిల్లాస్థాయిలో, హైకోర్టు లో పనిచేసి టీడీపీ తరఫున అనేక కేసులు వాదించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో జై భీమ్ రావు భారత్ పార్టీ స్థాపించారు. అయితే ఈ సారి ఎన్నికలకు టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపారు. కానీ టీడీపీ అధినేత ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించారు. కానీ సీటు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారు. దీంతో ఆయన తాను మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు ప్రకటింchandrababu{#}Telugu Desam Party;Nara Lokesh;Amaravati;Komaram Bheem;Sravan Kumar;High court;Mangalagiri;Tadepalli;CBN;Hanu Raghavapudi;Jagan;YCP;TDP;politics;Indiaచంద్రబాబు: లోకేశ్‌ గెలుపు కోసం బాబు చీలిక ప్లాన్‌ అదిరిందిగా?చంద్రబాబు: లోకేశ్‌ గెలుపు కోసం బాబు చీలిక ప్లాన్‌ అదిరిందిగా?chandrababu{#}Telugu Desam Party;Nara Lokesh;Amaravati;Komaram Bheem;Sravan Kumar;High court;Mangalagiri;Tadepalli;CBN;Hanu Raghavapudi;Jagan;YCP;TDP;politics;IndiaWed, 03 Apr 2024 07:34:29 GMTజడ శ్రవణ్ కుమార్.. ఈ పేరు తెలియని వారు ఏపీలో ఉండరు. తెలుగుదేశం పార్టీ అనుకూల న్యాయవాది. జిల్లాస్థాయిలో, హైకోర్టు లో పనిచేసి టీడీపీ తరఫున అనేక కేసులు వాదించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో జై భీమ్ రావు భారత్ పార్టీ స్థాపించారు. అయితే ఈ సారి ఎన్నికలకు టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపారు.


కానీ టీడీపీ అధినేత ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించారు. కానీ సీటు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారు. దీంతో ఆయన తాను మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు.  దీంతో పాటు మరో చోట పోటీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో టీడీపీకి తన సత్తా చూపించడానికే.. అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాడేపల్లి పట్టణంలో ఆర్.సీ. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల, దళితుల కోసం 2019 నుంచి అనేక పోరాటాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో ఉంటానని.. నారా లోకేశ్ కి మంగళగిరిలో ఓటు అడిగే హక్కు లేదని ఎన్నికల ముగిసిన తర్వాత అపాయిట్ మెంట్ కూడా ఇవ్వరని ఆరోపించారు. వైసీపీ నుంచి రాజకీయాలు అంటే తెలియని ఓ మహిళ పోటీ చేస్తుందని తెలిపారు.


2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 2943 మంది దళితులు మరణిస్తే ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఆయన టీడీపీపై రివర్స్ అవ్వడం వెనుక చంద్రబాబు స్కెచ్ ఏమైనా ఉందేమో అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉంటారు. టీడీపీకి వ్యతిరేకం అని ఈ ఓట్లను చీల్చేందుకు ఆయన యత్నిస్తున్నారు. వాస్తవానికి ఆయన అమరావతి మద్దతుదారు. జగన్ ని వద్దు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక తెచ్చి అంతిమంగా టీడీపీకి మేలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>