Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylebfa00b67-9c5c-4c9c-b57f-d837efae483e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylebfa00b67-9c5c-4c9c-b57f-d837efae483e-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‍లో ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో దేవరపై భారీగా అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె టాలీవుడ్ డెబ్యూ మూవీ కూడా ఇదే కావడం విశేషం..రీసెంట్ గా మూవీ నుంచి జాన్వీ లుక్ రిలీజ్ చేయగా పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఆమె అదిరిప#socialstars lifestyle{#}Darsakudu;Tom Banton;Tom Hooper;Chitram;anirudh ravichander;Sridevi Kapoor;Tollywood;koratala siva;Mass;NTR;Heroine;Car;Saif Ali Khan;Director;Girl;Shiva;lord siva;Cinema;Audience;bollywoodఖరీదైన కారు కొన్న ఎన్టీఆర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?ఖరీదైన కారు కొన్న ఎన్టీఆర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?#socialstars lifestyle{#}Darsakudu;Tom Banton;Tom Hooper;Chitram;anirudh ravichander;Sridevi Kapoor;Tollywood;koratala siva;Mass;NTR;Heroine;Car;Saif Ali Khan;Director;Girl;Shiva;lord siva;Cinema;Audience;bollywoodWed, 03 Apr 2024 05:53:45 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్' ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‍లో ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో దేవరపై భారీగా అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె టాలీవుడ్ డెబ్యూ మూవీ కూడా ఇదే కావడం విశేషం..రీసెంట్ గా మూవీ నుంచి జాన్వీ లుక్ రిలీజ్ చేయగా పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఆమె అదిరిపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటిస్తుండగా.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.జనవరిలో వచ్చిన దేవర గ్లింప్స్ ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.. దర్శకుడు కొరటాల శివ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. 

అలాగే ఈ మూవీలో అండర్ వాటర్ యాక్షన్ సీన్లు కూడా ఉండనున్నాయి.దేవర మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువకుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇటీవలే దేవర మూవీ గోవాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నేడు హైదరాబాద్‍లోని ఖైరతాబాద్ ఆర్‌టీవో ఆఫీస్‍లో కనిపించారు.తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం  ఎన్టీఆర్.. ఖైరతాబాద్ ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లారు. బ్లాక్ టీషర్ట్ మరియు బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి సింపుల్‍గా స్టైలిష్‍గా కనిపించారు.ఆర్‌టీవో ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ బయటికి వస్తుండగా కెమెరాలకు చిక్కగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ కొత్తగా 'మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ ఎస్-క్లాసిక్ ఎస్580' లగ్జరీ ప్రీమియం కారును కొనుగోలు చేశారు. ఈ కారులోనే ఆర్టీవో కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ప్రీమియమ్ ఎస్‍యూవీ కారు ప్రారంభ ధర రూ.2.8 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>