Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsfcf2a1c3-7308-4cba-a036-a9e06615cba9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsfcf2a1c3-7308-4cba-a036-a9e06615cba9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతున్నాయి.ప్రధాన రాజకీయ పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ ఈ సారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.. వైసీపీ తమ పార్టీలోని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లకు సీట్లు నిరాకరించింది.. అలాగే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంకు స్థానచలనం చేసింది..ఇలా ఎలాగైనా ఈ సారి కూడా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు.దానికి తగ్గట్టుగా బ#assembly elections{#}Bharatiya Janata Party;MLA;Party;TDP;YCP;mediaఏపీ : టీడీపీ కి తలనొప్పిగా మారిన సీట్ల పంచాయితీ..?ఏపీ : టీడీపీ కి తలనొప్పిగా మారిన సీట్ల పంచాయితీ..?#assembly elections{#}Bharatiya Janata Party;MLA;Party;TDP;YCP;mediaWed, 03 Apr 2024 08:14:56 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతున్నాయి.ప్రధాన రాజకీయ పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ ఈ సారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.. వైసీపీ తమ పార్టీలోని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లకు సీట్లు నిరాకరించింది.. అలాగే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంకు స్థానచలనం చేసింది..ఇలా ఎలాగైనా ఈ సారి కూడా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు.దానికి తగ్గట్టుగా బలమైన కార్యచరణ రూపొందిస్తున్నారు.. వైసీపీ గడప గడప ప్రచారంతో పాటు గా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రతి పక్ష పార్టీలను విమర్శిస్తూ ప్రచారం కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చాలా చురుకుగా ఉంటుంది. 

ఇక వైసీపీ పార్టీని ఎలా అయిన గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ.. బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో కూటమిగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అధికార పార్టీ ని గద్దె దించడానికి కూటమి నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి. అయితే పొత్తులో భాగంగా సీట్ల పంపకాల విషయంలో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. అసమ్మతి వర్గాలు కూటమికి తలనొప్పిగా మారాయి..

అలాగే టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా కొన్ని సార్లు టీడీపీ కి కాస్త చేటుగా మారుతుంది. అధికార పార్టీని విమర్శించే తీరులో కొన్నిసార్లు విమర్శలు తీవ్రం కావడంతో టీడీపీ కే నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ని పార్టీ ని బలోపేతం చేయడంలో సోషల్ మీడియా పాత్రను కాస్త కంట్రోల్ ఉంచితేనే ప్రజలలోకి పార్టీ పై నమ్మకం కుదురుతుంది. అలాగే పొత్తులో భాగంగా సీట్ల పంచాయితీలో  పట్టు వున్న నియోజకవర్గాలను కొన్నిటిని బీజేపీ కి ఇవ్వాల్సి రావడంతో టీడీపీ కి కాస్త నెగటివ్ గా మారినట్లు తెలుస్తుంది. కూటమి బలంగా ఉంటేనే అధికార పార్టీని ఓడించడం సులభం అవుతుంది.. లేకపోతే కూటమి బలహీనతే అధికార పార్టీ బలంగా మారే అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>