PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhuf1b93864-6ba8-4f6f-92a8-4820c79293d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhuf1b93864-6ba8-4f6f-92a8-4820c79293d6-415x250-IndiaHerald.jpgలోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంథని నియోజక వర్గం పరిధిలోని మహా ముత్తరం , కటారం, మలహల్ రావు , మండల ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో కొప్పుల ఈశ్వర్ , పుట్ట మధు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పుట్ట మధు కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ... అనేక మాయ మాటలను చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఇక పవర్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి అన్ని నెరవేర్చమని చెప్పుకుంటూ వస్తుంది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై ఇప్పటివరకు Madhu{#}maya;college;Eshwar;Maha;Parliment;Telangana Chief Minister;Congress;Elections;Party;Government;courtబీఆర్ఎస్ : మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే వదిలేది లేదు... పుట్ట మధు..!బీఆర్ఎస్ : మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే వదిలేది లేదు... పుట్ట మధు..!Madhu{#}maya;college;Eshwar;Maha;Parliment;Telangana Chief Minister;Congress;Elections;Party;Government;courtTue, 02 Apr 2024 23:42:00 GMTలోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంథని నియోజక వర్గం పరిధిలోని మహా ముత్తరం , కటారం, మలహల్ రావు , మండల ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో కొప్పుల ఈశ్వర్ , పుట్ట మధు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పుట్ట మధు కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ...

అనేక మాయ మాటలను చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఇక పవర్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి అన్ని నెరవేర్చమని చెప్పుకుంటూ వస్తుంది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. 200 యూనిట్ కరెంట్ అందరికీ వర్తించడం లేదు. ఉచిత బస్సుతో కాలేజీ విద్యార్థులు , మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు మరియు ప్రజలకు 24 కరెంట్ అందింది. 

ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వారికి ఆ సేవలు అందడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2000 పెన్షన్ ను సక్రమంగా ఇచ్చింది.  కాంగ్రెస్ ప్రభుత్వం 4వేల పెన్షన్ ఇస్తాను అంది ఇప్పటివరకు దాని జాడే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ఎగ్గొడదామని ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ అందరి తరపున మేము పోరాడుతాం. రైతులకు నష్టపోయిన పంటకు ఎకరానికి 25 వేల రూపాయల నష్ట పరిహారాన్ని అందించి అలాగే 5 బోనస్ లను అందించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. 

పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు ఆరు గంటల నిరసన దీక్ష చేస్తేనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి వీటిని విడుదల చేసింది. సంక్షేమ పథకాలను అమలులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొత్తం విఫలమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు కనుక పెడితే రానున్న రోజుల్లో వదిలి పెట్టే సవాలే లేదు. వాళ్ళను కోర్టు ముందు నిలబెడతా అని పుట్ట మధు అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>