PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsae6811a8-1cfa-489c-bf32-7c2efeb71214-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsae6811a8-1cfa-489c-bf32-7c2efeb71214-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశావ్యాప్తంగా జరగనున్న లోకసభ లాగే అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఈ కేసు అప్పుడప్పుడు చర్చకు దారితీసేది. ఈ కేసులో భాగంగా బెయిల్ పై ఉన్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో రఘురామ కోరారు.కాకపోతే ఆ కేసుపై లేటెస్ట్ గా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాలassembly elections{#}Andhra Pradesh;Supreme Court;MP;Jagan;YCP;Reddy;Supreme;Assembly;Hanu Raghavapudiఏపీ : అదే జరిగితే జగన్ కు భారీ నష్టం తప్పదా....??ఏపీ : అదే జరిగితే జగన్ కు భారీ నష్టం తప్పదా....??assembly elections{#}Andhra Pradesh;Supreme Court;MP;Jagan;YCP;Reddy;Supreme;Assembly;Hanu RaghavapudiTue, 02 Apr 2024 23:13:21 GMTప్రస్తుతం దేశావ్యాప్తంగా జరగనున్న లోకసభ లాగే అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత నుంచి ఈ కేసు అప్పుడప్పుడు చర్చకు దారితీసేది. ఈ కేసులో భాగంగా బెయిల్ పై ఉన్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో రఘురామ కోరారు.కాకపోతే ఆ కేసుపై లేటెస్ట్ గా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో ఇపుడు చర్చనీయ అంశంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది దర్మాసనం. ఒక రాష్ట్రానికి సంబంధించిన సిఎం కేసు విషయంలో ఆలస్యం వద్దని, ఆలస్యనికి కారణాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం.

ప్రస్తుతం సుప్రీమ్ ఆదేశాలతో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు అక్రమస్తుల కేసులో జగన్ జైలు కు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన.. 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సిఎం అయిన తరువాత ఈ కేసు మరుగున పడుతూ వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో జాప్యం జరుగుతోందని, నిందితుడిగా ఉన్న జగన్ బయట ఉండడం వల్ల మరిన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని గత ఏడాది రఘురామ వేసిన పిటిషన్తో మరోసారి తెరపైకి వచ్చింది.

దాని తర్వాత దర్మాసనం అనేక సార్లు ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ కేసు విషయంలో  సీబీఐకి సుప్రీం కోర్టు చురకలు అంటించడంతో ఎన్నికల ముందు ఈ కేసు విచారణ వేగవంతం అయిన ఆశ్చర్యం లేదనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈసారి ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో గెలవాలని ధీమాగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అక్రమస్తుల కేసు మళ్ళీ రీ ఓపెన్ అయితే పార్టీకి, ఆయనకు భారీ నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>