PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena61a48248-343d-458f-9552-4159880b5817-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena61a48248-343d-458f-9552-4159880b5817-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ పార్టీ గుర్తు "గాజు గ్లాసు"ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే చాలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను నటించే సినిమాల్లో కూడా ఈ గుర్తును ప్రమోట్ చేస్తుంటారు.తాజాగా పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ లో భాగంగా... "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. కచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం" అంటూ డైలాగ్ కూడా వదిలారు. ఈ డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందనేది అందరికి తెలిసిన విషయమే.ఇJanasena{#}MIM Party;Election Commission;Janasena;Telugu;kalyan;harish shankar;Telangana;Elections;central government;Andhra Pradesh;Partyజనసేనకి ఈసి షాక్.. బాధలో జనసైనికులు?జనసేనకి ఈసి షాక్.. బాధలో జనసైనికులు?Janasena{#}MIM Party;Election Commission;Janasena;Telugu;kalyan;harish shankar;Telangana;Elections;central government;Andhra Pradesh;PartyTue, 02 Apr 2024 18:18:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ పార్టీ గుర్తు "గాజు గ్లాసు"ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే చాలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను నటించే సినిమాల్లో కూడా ఈ గుర్తును ప్రమోట్ చేస్తుంటారు.తాజాగా పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ లో భాగంగా... "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. కచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం" అంటూ డైలాగ్ కూడా వదిలారు. ఈ డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందనేది అందరికి తెలిసిన విషయమే.ఇలా ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా.. తన పార్టీ సింబల్ గాజు గ్లాసును పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో.. నిన్నమొన్నటి దాకా పలు నియోజకవర్గాల్లో జనసైనికులు టీ దుకాణాల వద్ద గాజు గ్లాస్ లో కొంత సమయం వ్యవధిలో ఉచితంగా తేనీరు పంపిణీ చేస్తూ, పార్టీ సింబల్ ని ప్రమోట్ చేస్తుకుంటున్నారనే కథనాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్ విషయంలో షాక్ తగిలింది.ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో నెలా పదిరోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో... "మేమంతా సిద్ధం" అంటూ వైసీపీ.. "ప్రజాగళం" అంటూ తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేనలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేశాయి.


ఈ టైంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన "గాజు గ్లాసు"ను ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చింది. దీంతో... ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట కూటమి పరిస్థితి ఎమిటనే చర్చ తెరపైకి వచ్చింది.దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ తాజాగా తెలిపింది.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్స్, ఎంఐఎం లు గుర్తింపు పొందాయి. దీంతో... తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది. ఇక జనసేన పార్టీ విషయనికొస్తే... గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల లిస్టులో కాకుండా... కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే జనసేన పేరు కూడా ఉంది.దీంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చింది. దీంతో జనసైనికులు బాధలో ఉన్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసి.. ఒక స్థానంలో మాత్రమే గెలిచింది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చట్టసభల్లో తగిన ప్రతినిధ్యం లేకపోవడం వల్లే... నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>