MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondaf6cb7ad6-4e02-405e-b31e-c062435bd975-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondaf6cb7ad6-4e02-405e-b31e-c062435bd975-415x250-IndiaHerald.jpgతెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాలను ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమా దగ్గర నుంచి మొన్నటి 'ఖుషి' సినిమా దాకా ప్రమోషన్స్ విషయంలో అదే అగ్రెసివ్ నెస్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన ప్రచారంతోనే సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకురావడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో యాటిట్యూడ్.. అతని కామెంట్స్ అప్పుడప్పుడు కాంట్రావర్సీ అవుతుంటాయి. అది నచ్చక ఓవర్ చేస్తుంటాడని నెటిజన్స్ అతన్నిVijay Devarakonda{#}Press;netizens;Dil;Devarakonda;media;Sri Venkateshwara Creations;vijay deverakonda;Hero;Joseph Vijay;Cinemaవరుస ప్లాప్స్.. అందుకే రౌడీ ప్రవర్తన మారిందా?వరుస ప్లాప్స్.. అందుకే రౌడీ ప్రవర్తన మారిందా?Vijay Devarakonda{#}Press;netizens;Dil;Devarakonda;media;Sri Venkateshwara Creations;vijay deverakonda;Hero;Joseph Vijay;CinemaTue, 02 Apr 2024 19:14:00 GMTతెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాలను ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమా దగ్గర నుంచి మొన్నటి 'ఖుషి' సినిమా దాకా ప్రమోషన్స్ విషయంలో అదే అగ్రెసివ్ నెస్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన ప్రచారంతోనే సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకురావడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో  యాటిట్యూడ్.. అతని కామెంట్స్ అప్పుడప్పుడు కాంట్రావర్సీ అవుతుంటాయి. అది నచ్చక ఓవర్ చేస్తుంటాడని నెటిజన్స్ అతన్ని తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే ఒకప్పుడు ప్రమోషన్స్ లో హైపర్ యాక్టీవ్ మోడ్‌లో ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' సినిమా విషయంలో మాత్రం అణిగి మనిగి చాలా కూల్ గా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.పరశురామ్  దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ నేపథ్యంలో విజయ్ అండ్ టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిల్లో విజయ్ ఇంతకముందుగా కాకుండా, పూర్తి భిన్నంగా కూల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్‌లో కూడా అతను చాలా సెన్సిబుల్‌గా, ప్రశాంతంగా అతి చేయకుండా కూల్ గా కనిపిస్తున్నారు. సినిమాలో తాను పోషించిన గోవర్ధన్ పాత్రకు తగ్గట్టుగా, బయట కూడా ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్‌' ప్రెస్ మీట్ లో మీడియా సంధించిన కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు కూడా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చి  ఆకట్టుకున్నారు. విజయ్ ఏది అడిగినా ఎంతో మెచ్యూర్ గా, చాలా జాగ్రత్తగా ఆలోచించి జవాబులు చెప్తున్నారు. అలాగే ఎప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్ లు వేసే విజయ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు కొత్త డ్రెస్సింగ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు.తను ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, సినిమా రిలీజ్ కు ముందు అనవసరపు వివాదాల్లోకి వెళ్లకూడదని విజయ్ నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. వరుస ప్లాపులు వల్ల విజయ్ ఇలా అణిగి మనిగి ఉన్నాడని నెటిజన్స్ అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>