PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20240630ad72-28e9-4a1d-995f-37275f08df2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20240630ad72-28e9-4a1d-995f-37275f08df2f-415x250-IndiaHerald.jpgఅశోక్ గజపతి రాజు అంటే తెలుగుదేశం పార్టీలో టాప్ 10 నేతల్లో టాప్ 2 నేతగా టీడీపీ ఫ్యాన్స్ చెప్పుకుంటారు. చంద్రబాబు తరువాత టీడీపీలో అంత పవర్ ఫుల్ నేత. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు ఆయన. ఎన్నడూ ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు షాకింగ్ అంశం అయ్యింది.రాజకీయాల్లో అసలు ఈయన అంటే తెలియని వారుండరు. విజయనగర సంస్థానాధీశులైన గజపతిరాజుల వారసులే ఈ అశోక్ గజపతిరాజు. అశోక్ గజపతిరాజు కూడా రాజకీయాల్లో తిరుగులేనAP Elections 2024{#}Vijayanagaram;king;High court;central government;Vizianagaram;Wife;ashok;politics;Telugu Desam Party;Hanu Raghavapudi;Elections;Parliment;Andhra Pradesh;TDP;MLA;MP;Assembly;CBN;Partyఅశోక్ గజపతిరాజు: టీడీపీ విధేయున్ని కోల్పోయిందిగా?అశోక్ గజపతిరాజు: టీడీపీ విధేయున్ని కోల్పోయిందిగా?AP Elections 2024{#}Vijayanagaram;king;High court;central government;Vizianagaram;Wife;ashok;politics;Telugu Desam Party;Hanu Raghavapudi;Elections;Parliment;Andhra Pradesh;TDP;MLA;MP;Assembly;CBN;PartyTue, 02 Apr 2024 10:32:28 GMTఅశోక్ గజపతి రాజు అంటే తెలుగుదేశం పార్టీలో టాప్ 10 నేతల్లో టాప్ 2 నేతగా టీడీపీ ఫ్యాన్స్ చెప్పుకుంటారు. చంద్రబాబు తరువాత టీడీపీలో అంత పవర్ ఫుల్ నేత. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు ఆయన. ఎన్నడూ ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు షాకింగ్ అంశం అయ్యింది.రాజకీయాల్లో అసలు ఈయన అంటే తెలియని వారుండరు. విజయనగర సంస్థానాధీశులైన గజపతిరాజుల వారసులే ఈ అశోక్ గజపతిరాజు.  అశోక్ గజపతిరాజు కూడా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన అశోక్ గజపతిరాజు మొత్తం పది సార్లు ఎన్నికల బరిలో దిగగా 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు తప్ప వరుసగా అన్నీ ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో సమకాలిక రాజకీయాలు చేసిన నేత అశోక్ గజపతి రాజు.2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడిన అశోక్ గజపతిరాజు ఎన్నికల తరువాత మేజర్ సర్జరీ చేయించుకున్నారు.


అప్పటినుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతునప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొనేవారు. అయితే ఆ క్రమంలోనే వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు లేని విధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు. అప్పటికే మాన్సాస్ ఛైర్మన్‎గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును మాన్సాస్ ఛైర్మన్ గా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలని తీసుకున్నారు.అనుకోని పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో చాలా కేసులు  అశోక్ గజపతిరాజు పై నమోదయ్యాయి. 70 సంవత్సరాల వయసులో అశోక్ గజపతిరాజు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలా  అనారోగ్య సమస్యలతో పాటు మాన్సాస్ ట్రస్ట్ వివాదాలతో చాలా సమస్యలు వెంటాడాయి.. రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఎంపిగా బరిలోకి దిగుతారని అంతా అనుకున్నారు. అయితే విజయనగరం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన కుమార్తె అదితి గజపతి రాజుకు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం.ఇంకా ఎంపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు ఖరారు చేసింది. దీంతో అశోక్ గజపతిరాజు పోటీపై అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తం అవ్వగా ఆయన తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. భవిష్యత్తులో ఒక సీనియర్‎గా పార్టీ ఎప్పుడైనా, ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానన్నారు. ఏది ఏమైనా టీడీపీకి ఇలాంటి నేత దూరం కావడం వల్ల టీడీపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>